Gold And Silver Rates Today: దోబూచులాడుతున్న బంగారం, వెండి ధరలు..మళ్లీ తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్..ఎంత తగ్గాయంటే?
Gold And Silver Rates Today: బంగారం, వెండి ధరలు పసిడి ప్రియులతో దోబూచులాడుతున్నాయి. ఒక రోజు భారీగా పెరిగితే మరుసటి రోజు భారీగా తగ్గుతున్నాయి. బంగారానికి భారతదేశానికి మధ్య ఉన్న సంబంధం గురించి తెలిసిందే. బంగారం భారీగా పెరిగినా..తగ్గినా కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు పసిడి ప్రియులు. ఈనేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర నేడు శుక్రవారం కూడా స్వల్పంగా తగ్గింది. అయితే వెండి మాత్రం గురువారం ఏనాడు లేని విధంగా భారీగా పెరిగింది. అయితే శుక్రవారం వెండి ధరలకు కళ్లేం పడింది. ధర ఒక్కసారిగా భారీగా పడిపోయింది.
అయితే గతంలో గరిష్టాలకు చేరుకున్న బంగారం ప్రస్తుతం క్రమంగా తగ్గుతోంది. దీపావళికి ముందు బంగారం, వెండి ధరలు భారీగాపెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 190 తగ్గింది. రూ. 77,490కి చేరుకుంది.
హైదరాబాద్, విజయవాడలో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 180 రూపాయలు మేర తగ్గింది. రూ. 77, 340కి చేరుకుంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70, 890కి చేరుకుంది. ఢిల్లీలో 24క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 77, 490కి చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 71,040 కి పడిపోయింది. కానీ వెండి ధరలు మాత్రం నేడు కాస్త తగ్గాయి.
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్లాన్స్ కారణంగా ప్రపంచ అనిశ్చితి పెరిగిందని బంగారం వ్యాపారులు చెబుతున్నారు. ఈమధ్య అమెరికా ఆర్ధిక డేటా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశాన్ని తగ్గించింది. దీంతో పెట్టుబడిదారులు బంగారం, వెండి ధరల పట్ల ఊదాసీనంగా ఉన్నారు.
ఎల్ కేపీ సెక్యూరిటీస్ లో కమెడిటీ అండ్ కరెన్సీ వీపీ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది స్పందించారు. బంగారం ధరలు అస్థిరతను చవిచూశాయని..రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం అనేది భౌగోలిక రాజకీయ ఉద్రిక్తల మధ్య మొదట్లో బలహీనంగా ఉన్నప్పటికీ తొందరగానే కోలుకుందన్నారు.
ఇక రాబోయే కొన్ని నెలల్లోనే బంగారం ధర లక్ష రూపాయలు దాటే ఛాన్స్ ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ పరిణామాలు , బంగారం డిమాండ్ ను బట్టి రేట్లు మారుతుంటాయి. భారత్ లో బంగారానికి ఎల్లప్పుడూ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి బంగారం ధరల్లో భారీగా మార్పులు వస్తున్నాయి.
సెంట్రల్ బ్యాంకు బంగారం కొనుగోళ్లు, యూఎస్ లో వడ్డీ రేటు తగ్గింపు కారణంగా గోల్డ్ రేట్స్ వచ్చే ఏడాది మళ్లీరికార్డు స్థాయిలో పెరగవచ్చని గోల్డ్ మన్ సాచ్స్ రిపోర్టు తెలిపింది.