Gold Price Decline: పసిడి ప్రియులకు శుభవార్త ట్రంప్ విజయం, భారీగా తగ్గిన పసిడి ధర
చెన్నైలో 22 క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర 72 వేలకు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ధర 78,560 రూపాయలైంది.
ఇక గుంటూరు, విశాఖపట్నంలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 72 వేలకు తగ్గగా 24 క్యారెట్ల బంగారం 78.560 రూపాయలకు తగ్గింది
విజయవాడలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 72 వేలకు చేరుకోగా, 24 క్యారెట్ల బంగారం 78.560 రూపాయలకు పడిపోయింది.
అదే హైదరాబాద్‌లో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర 72 వేలకు తగ్గగా 24 క్యారెట్ల బంగారం 78,560కు చేరింది
ఢిల్లీలో 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర 1790 రూపాయలు తగ్గిపోయింది. అంటే ప్రస్తుతం 78,710 రూపాయలకు చేరుకుంది. అటు 22 క్యారట్ల బంగారం 10 గ్రాములకు 1650 రూపాయలు తగ్గి 72,150 రూపాయలకు చేరుకుంది.
రాజకీయ, ఆర్ధిక పరిణామాల కాంబినేషన్ మార్కెట్ సెంటిమెంట్‌ను ట్రిగ్గర్ చేసింది. దాంతో బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపించింది. 24 క్యారెట్ల బంగారం ఒక్కసారిగా తగ్గిపోయింది.
బంగారం ధర ఒక్కసారిగా పలు వారాల కనిష్టానికి పడిపోయింది. అమెరికా అధ్యక్షుడిగా అటు డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించగానే ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధర పడిపోయింది.