Gold Price Today 05 February 2021: బులియన్ మార్కెట్‌లో మళ్లీ దిగొచ్చిన Gold Price, క్షీణించిన Silver Rate

Fri, 05 Feb 2021-9:00 am,

Gold Price Today 05 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు(Gold Price Today) తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధానితో పాటు హైదరాబాద్‌లోనూ వెండి ధర భారీగా పతనమయ్యాయి.

Also Read: Ujjwala Yojana: Free LPG కనెక్షన్, రూ.1600 రావాలంటే PMUY వివరాలు తెలుసుకోండి

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.440 మేర తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,380 అయింది. 22 క్యారెట్ల బంగారం సైతం రూ.400 తగ్గడంతో నేడు 10 గ్రాముల బంగారం ధర రూ.44,350కి పతనమైంది.

ఢిల్లీలో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. 24 క్యారెట్లపై రూ.430 మేర తగ్గడంతో బంగారం 10 గ్రాముల ధర రూ.50,730 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.400 మేర తగ్గడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 అయింది.

Also Read: Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్ లేని దేశాలు కూడా ఉన్నాయి, No Income Tax దేశాలు ఇవే

ఢిల్లీలో వరుసగా మూడోరోజు వెండి ధర దిగొచ్చింది. తాజాగా వెండి ధర రూ.1,000 మేర దిగిరావడంతో 1 కేజీ వెండి ధర రూ.68,000కి పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.1,000 మేర దిగొచ్చింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.72,200కు పడిపోయింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link