Gold Rate Today:భారీగా తగ్గిన బంగారం ధర.. తులం పసిడి ధర ఎంతో తెలిస్తే పండగ చేసుకుంటారు
Gold Rate: వరుసగా కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధరలకు కాస్త చెక్ పడింది. నవంబర్ రెండవ తేదీ శనివారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 81240 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74650 రూపాయలు పలికింది. బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే రూ. 650 తగ్గింది.
బంగారం ధరలు భారీగా తగ్గడానికి ప్రధానంగా ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులను చెబుతున్నారు. బంగారం ధరలు భారీగా పెరగడంతో ప్రస్తుత దశ నుంచి కొద్దిగా సర్దుబాటు జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికి కూడా ఇంకా ఆల్ టైం రికార్డు సమీప స్థాయిలోనే బంగారం ధరలు ఉన్నాయి.
బంగారం ధరలు పెరగడానికి దోహదపడే అంశాల్లో ముఖ్యంగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు చెప్పవచ్చు. అమెరికా అధ్యక్షుడు ఎన్నికల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొని ఉంది ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ వర్సెస్ కమల హారిస్ గా నడుస్తున్న ఎన్నికలు, అమెరికా భవిష్యత్తుకు ఎంతో అవసరమైనవి. అయితే ప్రస్తుతం ఉన్న అంచనాలను బట్టి చూస్తున్నట్లయితే కమలహారిస్ ట్రంప్ పైన కొద్దిగా ఆధిక్యంలో ఉన్న వార్తలు వస్తున్నాయి.
దీంతో స్టాక్ మార్కెట్లలో కాస్త చలనం కనిపిస్తోంది. ఫలితంగా బంగారం పైన పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితి కూడా బంగారం ధరలు తగ్గడానికి ఉపయోగపడిందని చెప్పవచ్చు.
ఇదిలా ఉంటే బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారం లో పై పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి, ఫిజికల్ గోల్డ్ కన్నా కూడా డిజిటల్ రూపంలో గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని ఎప్పుడు నుండి సూచిస్తున్నారు. ముఖ్యంగా బంగారు ఆభరణాల కన్నా కేంద్ర ప్రభుత్వం జారీ చేసే సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేయడం అనేది చక్కటి పని అని చెప్పవచ్చు.
ఈ బాండ్లు బంగారంతో సమానమైనవి. బంగారం ధర పెరిగే కొద్దీ ఈ బాండ్ విలువ పెరుగుతుంది. బంగారం తగ్గినప్పుడు కూడా ఈ బాండ్ విలువ తగ్గుతుంది. ఈ బాండ్లను ప్రత్యేకంగా మీరు దాచుకోవాల్సిన పనిలేదు ఇవి మీ డిజిటల్ వాలెట్లో భద్రంగా ఉంటాయి. కాదు ఈ బాండ్ల పైన మీకు అదనంగా వడ్డీ కూడా చెల్లిస్తారు. ఇలా చూసినట్లయితే ఈ బాండ్లు ఎంతో లాభదాయకమని చెప్పవచ్చు.
ఇంకా అలాగే బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బరువు విషయంలోనూ నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడద్దని నిపుణులు సూచిస్తున్నారు.