Gold Price Today In Hyderabad 07 June 2021: నేడు మిశ్రమంగా బంగారం ధర, నిలకడగా వెండి ధరలు

Mon, 07 Jun 2021-9:07 am,

Gold Rate Today 07 June 2021: కరోనా సెకండ్ వేవ్‌ బులియన్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. బంగారం ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధర పుంజుకోగా, ఢిల్లీలో బంగారం ధర నిలకడగా ఉంది. వెండి ధర మాత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ స్థిరంగా గత వారాంతం ధరలలో విక్రయాలు జరుగుతున్నాయి.

Also Read: WhatsApps Fast Playback Feature: వాట్సాప్ సరికొత్త ఫీచర్, ఇకపై ఆ వేగం పెరుగుతుంది

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌ (Gold Rate Today In Hyderabad), విజయవాడ మార్కెట్లలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతోంది. రూ.430 మేర బంగారం ధర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.50,090 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,920కు చేరుకుంది.

Also Read: LPG Gas Paytm Offer: ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ క్యాష్‌బ్యాక్ ఆఫర్, Freeగా LPG Cylinder

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. గత వారాంతంలో ఉన్న ధరతో నేడు సైతం విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,270కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,120 అయింది.

వెండి ధరలపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చూపుతోంది. ఢిల్లీలో వెండి ధర నిలకడగా ఉంది. గత వారాంతం తరహాలోనే 1 కేజీ వెండి ధర రూ.71,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. విజయవాడ, హైదరాబాద్ మార్కెట్‌లలో నేడు 1 కేజీ ధర రూ.76,300 వద్ద ట్రేడింగ్ జరుగుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link