Gold Price Today 09 April 2021: కొనుగోలుదారులకు షాక్, మళ్లీ పెరిగిన బంగారం ధరలు, Silver Price

Fri, 09 Apr 2021-8:35 am,

Gold Price Today 09 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పుంజుకున్నాయి. తాజాగా బంగారం ధరలు పెరగగా, వెండి ధరలు సైతం రికార్డు ధరలకు చేరుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి. వెండి ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధరలు వరుసగా మూడోరోజు పెరిగాయి. తాజాగా రూ.370 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,900 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,000కి చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా రూ.380 మేర పెరిగింది. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,250కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారంపై 10 గ్రాముల ధర రూ.45,150 వద్ద మార్కెట్ అవుతోంది.

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. తాజాగా వెండి ధర రూ.360 మేర పెరిగింది. నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.66,660 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.800 మేర పెరిగింది. తాజాగా హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.71,300 అయింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link