Gold Price Today: బులియన్ మార్కెట్‌లో తగ్గిన బంగారం ధరలు, మళ్లీ పుంజుకున్న Silver Price
Gold Price Today 14 February 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గుతున్నాయి. వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలు పతనం కాగా, ఢిల్లీలోనూ వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.
Also Read: Mutual Funds: రోజుకు రూ.70 ఇన్వెస్ట్ చేసి రూ.1 కోటి వరకు పొందవచ్చు, Best Plan వివరాలు మీకోసం
విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర రూ.310 మేర తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.48,290కి పతనమైంది. 22 క్యారెట్ల బంగారంపై అంతే దిగిరావడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.44,250కి క్షీణించింది.
Also Read: WhatsApp ప్రైవసీ పాలసీతో నెంబర్ 1గా నిలిచిన మరో మెసేజింగ్ యాప్
ఢిల్లీలో గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. తాజాగా రూ.340 మేర దిగొచ్చింది. తాజాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,620 అయింది. అదే సమయంలో 22 క్యారెట్లపై 10 గ్రాముల బంగారంపై రూ.300 మేర తగ్గడంతో ధర రూ.46,400కి దిగొచ్చింది.
Also Read: BSNL Offers: డబుల్ ధమాకా, రెట్టింపు డేటా అందిస్తున్న బీఎస్ఎన్ఎల్
బులియన్ మార్కెట్‌లో మూడో వారంలో వెండి ధరలు పెరుగుతున్నాయి. తాజాగా వెండి ధర రూ.500 మేర పెరిగింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.69,200కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.600 మేర పుంజుకుంది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.73,900 అయింది.