Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, వెండి ధరలు
Gold Price Today In Hyderabad 4 March 2021: బులియన్ మార్కెట్‌లో నిన్న పెరిగిన బంగారం ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు సైతం మళ్లీ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఢిల్లీలోనూ బంగారం, వెండి ధరలు అమాంతం పుంజుకున్నాయి.
Also Read: EPFO Interest Rates: 6 కోట్ల మంది EPF ఖాతాదారులకు షాక్, వడ్డీ రేట్లుపై ఎంతమేర కోత విధిస్తారో
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Hyderabad)లలో బంగారం ధర మళ్లీ పెరిగింది. తాజాగా రూ.370 మేర స్వల్పంగా పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.46,300 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.350 తగ్గడంతో బంగారం ధర రూ.42,450 అయింది.
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా రూ.370 మేర బంగారం ధర పుంజుకోవడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,650 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,600కి చేరింది.
Also Read: Changes From 1 March: ఎస్బీఐ, FASTag సహా ఈ అంశాలు మార్చి 1 నుంచి మారుతున్నాయి
బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా పెరిగాయి. వెండి ధర రూ.1,300 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.67,900 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.800 మేర పెరిగింది. మార్కెట్‌లో నేడు 1 కేజీ వెండి ధర రూ.72,800 అయింది.