Gold Price Today In Hyderabad 7 March 2021: బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, Silver Price

Sun, 07 Mar 2021-7:33 am,

Gold Rate Today In Hyderabad 7 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం స్వల్పంగా పెరిగాయి. అయినా పసిడి ధరలు నెల రోజుల కనిష్ట ధరలు నమోదు చేస్తున్నాయి. మరోవైపు ఆల్‌టైమ్ గరిష్ట ధరలు నమోదు చేసిన వెండి ధరలు తాజాగా స్వల్పంగా పెరిగాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఢిల్లీలోనూ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగినా దాదాపు నెల రోజుల కనిష్ట ధరలకు దగ్గరగా మార్కెట్ అవుతున్నాయి.

Also Read: EPF Interest Rate: EPFO ఖాతాదారులకు కేంద్రం శుభవార్త, 6 కోట్ల మంది హర్షం

తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో బంగారం ధర మళ్లీ పతనమైంది. తాజాగా రూ.270 మేర దిగిరావడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.45,490 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.250 తగ్గడంతో బంగారం ధర రూ.41,700 అయింది.

Also Read: 7th Pay Commission Latest News: ఇన్‌కమ్ ట్యాక్స్ అదనపు ప్రయోజనాలు పొందాలనుకుంటే Govt Employeesకు శుభవార్త

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా రూ.280 మేర బంగారం పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,840 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.43,850కి చేరింది.

Also Read: Reliance Jio: కేవలం రూ.22తో రిలయన్స్ జియో డేటా ప్లాన్, తక్కువ ధరకు ఎన్నో ప్రయోజనాలు

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి. వెండి ధర రూ.280 మేర పెరగడంతో 1 కేజీ వెండి ధర రూ.65,700 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.200 మేర స్వల్పంగా పెరిగింది. దీంతో నిన్న మార్కెట్‌లో 10 కనిష్టానికి చేరుకున్న వెండి 1 కేజీ ధర రూ.70,100కి చేరింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link