Gold News: బంగారం ధర భారీగా తగ్గే అవకాశం.. ఎంత వరకూ పడుతుందో తెలిస్తే పసిడి ప్రియులకు పండగే
Gold Rate: బంగారం ధరకు గత కొంత కాలంగా స్వల్పంగా తగ్గుతూ వస్తోంది. ఈ నెల ప్రారంభం నుంచి ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకిన బంగారం ధర ఆ తర్వాత నెమ్మదిగా తగ్గడం ప్రారంభించింది. ప్రస్తుతం బంగారం ధర చూసినట్లయితే అక్టోబర్ 12 శనివారం రోజు 77, 450 రూపాయల సమీపంలో ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర విషయానికొస్తే ఇది కూడా ప్రస్తుతం 71 వేల రూపాయల సమీపంలో ట్రేడ్ అవుతోంది.
బంగారం ధరలు గత కొంతకాలంగా చరిత్రలోనే ఎప్పుడు చూడని విధంగా ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకాయి. అయితే ఇక్కడి నుంచి కూడా బంగారం ధర మరింత పెరుగుతుంది అని మొదట నిపుణులు భావించారు. దీనికి ప్రధాన కారణం భౌగోళిక ఉద్రిక్తతల్లో భాగంగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య నెలకొని ఉన్న యుద్ధ వాతావరణం అని చెప్పవచ్చు.
పశ్చిమాసియా దేశాల్లో రాజుకున్న ఈ మంట వల్ల అటు ప్రపంచ వాణిజ్యం మొత్తం కుదేలయ్యే పరిస్థితికి చేరింది. ముఖ్యంగా పశ్చిమాసియా దేశాలు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తికి, సరఫరాకు అత్యంత కీలకమైనవి. అయితే ఈ యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉంది. అయితే క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోవడం వల్ల ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది.
దీంతో అటు వ్యాపార పరంగా పలు కంపెనీలు తమ లాభదాయకతను కోల్పోతాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో కూడా నష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్ మెంట్ బంగారం వైపు తరలించే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బంగారం వైపు ఇన్వెస్టర్లు తమ చూపు ఎప్పుడూ వేసి ఉంచుతారు. దీనికి ప్రధాన కారణం బంగారం అనేది ఒక సురక్షితమైన పెట్టుబడి సాధనం.
ప్రపంచంలో ఏ సంక్షోభం వచ్చినా ఇన్వెస్టర్లు బంగారం అయితే పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. దీనికి ప్రధాన కారణం బంగారంలో నష్టం అనేది చాలా తక్కువగా వస్తుంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణము ఎవరైతే బంగారం పైన ఇన్వెస్ట్ చేశారు వారు తమ లాభాలను విత్డ్రా చేసుకుంటున్నారు. ఈ కారణంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి.
అయితే మరోవైపు అమెరికా స్టాక్ మార్కెట్ లో కూడా గల్ఫ్ యుద్ధం ఉన్నప్పటికీ పాజిటివ్ గానే ట్రెండ్ అవుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను బంగారం నుంచి ఉపసంహరించి మళ్లీ స్టాక్ మార్కెట్లలో పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది.