Gold Rate In Hyderabad 15th June 2021: బులియన్ మార్కెట్‌లో నేటి బంగారం, వెండి ధరలు

Tue, 15 Jun 2021-11:43 am,

Gold Rate Update 15 June 2021: కరోనా సెకండ్ వేవ్ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ రాజధానిలోనూ ప్రభావం చూపుతోంది. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర దిగొచ్చింది. ఢిల్లీలోనూ ధరలు క్షీణించాయి. వెండి ధర తెలుగు రాష్ట్రాల్లో తగ్గడా, ఢిల్లీలోనూ ధరలు భారీగా పతనమయ్యాయి.

Gold Price in Hyderabad 15th June 2021: కరోనా సెకండ్ వేవ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపుతోంది. తాజాగా ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌, విజయవాడలలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,630 వద్ద మార్కెట్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ప్రభావంతో ధరలు క్షీణిస్తున్నాయి. ఢిల్లీలో బంగారం ధర రూ.400 మేర దిగొచ్చింది. నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,800కు పతనమైంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,650 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.

బులియన్ మార్కెట్లో వెండి ధరలు వరుసగా రెండోరోజు క్షీణించాయి. ఢిల్లీలో తాజాగా రూ.500 మేర తగ్గడంతో 1 కేజీ వెండి ధర రూ.71,400కు దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ వెండి ధరలు దిగొస్తున్నాయి. విజయవాడ, హైదరాబాద్ లాంటి మార్కెట్లలో వెండి ధర రూ.600 మేర పతనమైంది. నేడు తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్లో వెండి 1 కేజీ ధర రూ.75,900కు పతనమైంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link