Gold Rate Today: ఇది కదా కావాల్సింది...బంగారం ధర తులంపై ఏకంగా రూ. 6వేలు తగ్గింది. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
Gold Rate Today: బంగారం ధరలు తగ్గుతున్నాయి. పసిడి ప్రియులకు ఇప్పుడే బంగారం కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే భవిష్యత్తులో బంగారం ధరలు మళ్లీ భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే నేడు డిసెంబర్ 2 సోమవారం నాడు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. నిన్న ఆదివారంతో పోల్చితే ధరలో స్వల్ప మార్పు కనిపించింది. నేటి ధరలను చూస్తే 24 క్యారెట్ల బంగారం ధర 77,990 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 71,490 ఉంది. అయితే గతంలో బంగారం ధర రూ. 84వేలకు చేరువైంది. అప్పటి నుంచి చూస్తే ఇప్పుడు బంగారం ధర దాదాపు రూ. 6వేల వరకు తగ్గిందని చెప్పవచ్చు.
అయితే బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్న కారణాలే అని చెప్పవచ్చు. బంగారం ధరలు అమెరికాలో ప్రస్తుతం ఒక ఔన్సు ధర రూ. 2600 డాలర్లు ఉంది.
బంగారం ధర తగ్గడానికి కూడా ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకున్న పరిస్థితులే అని చెప్పవచ్చు. డాలర్ విలువ పెరగడంతో కూడా కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుతం రూపాయి విలువ భారీగా పతనం అవుతున్న నేపథ్యంలో డాలర్ ధర 84 రూపాయలపైనా ట్రేడ్ అవుతోంది.
బంగారం ధరలు జనవరి నెల చివరి నుంచి మరింత తగ్గే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ప్రధానంగా అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు చేపడితే స్టాక్ మార్కెట్లలో మరిన్ని లాభాలు వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఫలితంగా తమ పెట్టుబడులను బంగారం నుంచి ఉపసంహరించుకుని స్టాక్ మార్కెట్ల వైపు ఇన్వెస్టర్లు వెళ్లే ఛాన్స్ ఉందని అంటున్నారు.
బంగారం డిసెంబర్ 2024 MCX ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 76400.0 వద్ద ట్రేడవుతున్నాయి. ఇది 0.893% పెరుగుదలను సూచిస్తుంది. ఇంతలో, వెండి మే 2025 MCX ఫ్యూచర్స్ కిలోకు రూ. 92947.0 వద్ద ట్రేడవుతున్నాయి. ఇది 1.204% పెరుగుదలను సూచిస్తుంది.
బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు ప్రముఖ ఆభరణాల తీర్పుతో సహా అనేక అంశాలచే ప్రభావితమవుతాయి. బంగారం కోసం ప్రపంచ డిమాండ్, దేశాల మధ్య కరెన్సీ విలువల్లో వ్యత్యాసాలు, ప్రస్తుత వడ్డీ రేట్లు, గోల్డ్ ట్రేడింగ్‌కు సంబంధించిన ప్రభుత్వ నిబంధనలు వంటి అంశాలు ఈ మార్పులకు దోహదం చేస్తాయి. అదనంగా, గ్లోబల్ ఎకానమీ మొత్తం పరిస్థితి, ఇతర కరెన్సీలతో US డాలర్ బలపడటం వంటి గ్లోబల్ ఈవెంట్‌లు కూడా భారతీయ మార్కెట్లో బంగారం ధరలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.