Gold News: లక్ష దిశగా దూసుకెళ్తున్న బంగారం.. ఎప్పుడు దాటుతుందో తెలిస్తే గుండె గుభేల్ అనడం ఖాయం
Gold Rate Today: బంగారం ధర అందరూ ఊహించినట్లుగానే ఒక లక్ష దిశగా అడుగులు వేస్తోంది. అయితే తులం ఒక లక్ష ఎప్పుడు చేరుతుంది అని మీ అందరూ భావించవచ్చు. కానీ అతి త్వరలోనే ఇది సాధ్యమయ్యే దిశగా కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బహుశా 2025 సంవత్సరంలోనే ఒక లక్ష తులం బంగారం చూసే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు.
నేడు నవంబర్ మూడో తేదీ 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 80950 రూపాయలు తాకగా. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 74550 రూపాయలు పలికింది. అయితే బంగారు ఆభరణాలు చేయించుకునే వారికి ఇది ఒక రకంగా చెప్పాలంటే పెరుగుతున్న ధరలు ఆర్థికంగా పెద్ద భారం అని చెప్పవచ్చు. గత సంవత్సరం బంగారం ధర ఇదే సమయానికి 63000 మాత్రమే ఉంది.
అక్కడి నుంచి చూసినట్లయితే బంగారం ధర దాదాపు 19 వేల రూపాయలు పెరిగింది. బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా నెలకొన్న పరిస్థితులతో పాటు దేశీయంగా పలు కారణాలు ఉన్నాయి. బంగారం ధరలు పెరగడం ఒక రకంగా చెప్పాలంటే, భారీగా పెరుగుదల వెనుక మార్కెట్లలో ఉండే అనిశ్చితి కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
ఎప్పుడైనా సరే మార్కెట్లు ఊగిసలాటకు గురవుతూ ఉంటాయో అలాంటి సమయంలో, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తూ ఉంటారు ఫలితంగా బంగారం ధరలు, భారీగా పెరుగుతూ ఉంటాయి. దీనికి తోడు చైనా లాంటి దేశాలు బంగారం నిలువలను పెంచుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా ఎలా పెడ బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. దీంతో పసిడి ధరలు భారీగా పెరుగుతున్నాయి.
అయితే బంగారం ధరలు భవిష్యత్తులో తగ్గుతాయా లేక మరింత పెరుగుతాయా అనే వారికి మాత్రం బంగారం ధరలు ప్రస్తుతం తగ్గే సూచనలు అయితే కనిపించడం లేదని చెప్పవచ్చు. గత జూలై నెలలో బంగారం ధరలు బడ్జెట్ సందర్భంగా భారీగా తగ్గాయి. దిగుమతి సుంకం తగ్గించడంతో బంగారం ధర భారీగా తగ్గి 67 వేల రూపాయల తులానికి చేరింది.
కానీ మళ్ళీ అక్కడి నుంచి బంగారం ధర భారీగా పెరుగుతూ 82,000 వరకు చేరింది. అంటే బంగారం ధర దాదాపు 15 వేల రూపాయలు పెరిగింది. అంటే కేవలం మూడు నెలల వ్యవధిలోనే 15 వేల రూపాయలు పెరిగింది అని అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి మరో మూడు నెలల్లో 15 వేల రూపాయలు పెరిగితే బంగారం ధర 1 లక్ష రూపాయల సమీపానికి చేరుతుంది అని అర్థం.