Gold Rate Today: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం ధర.. తులం రూ. 80వేలు దాటేసింది
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు.. నేడు జనవరి 9వ తేదీ గురువారం భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,050రూపాయలు పలుకుతుంది.22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,850 చేరుకుంది.
ఇక బంగారం ధరలు భారీగా పెరిగేందుకు ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకున్న పరిస్థితి కారణమని చెప్పవచ్చు. ముఖ్యంగా మార్కెట్లో ప్రస్తుతం బంగారం ధర భారీగా పెరుగుతుంది. ఒక ఔన్స్ పసిడి ధర 2670 డాలర్ల ఎగువకు ట్రేడ్ అవుతోంది.
మరో ప్రధాన కారణం అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఆశించిన మేర ఆర్థిక గణాంకాలు రాకపోవడం కూడా మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చు. అలాగే అమెరికాలో ఆర్థిక సంక్షోభం నీడలు ఇన్వెస్టర్లను తీవ్రంగా భయపడుతున్నాయి.
బంగారం ధరలు భారీగా పెరగడానికి దోహదపడుతుందని చెప్పవచ్చు. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన బంగారం వైపు తరలించేందుకు రెడీగా ఉంటున్నారు.
బంగారం ధరలు గత వారం రోజులుగా పెరుగుతూనే వస్తున్నాయి. అయితే ఇప్పుడు బంగారం ధర 80,000 దాటడంతో మరోసారి పసిడి గరిష్ట ధర రికార్డు దిశకు అడుగులు వేస్తోంది. అయితే ఇప్పటికే బంగారం ధర ఆల్ టైం రికార్డ్ 84 వేల రూపాయల ఎగువన ఉంది.
బంగారం ధరలు కొత్త ఏడాది ప్రారంభం నుంచి కూడా పెరుగుతున్నాయి. అయితే ఈ నెల చివరి వారంలో డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో బంగారం ధరలు ఏ విధంగా హెచ్చుతగ్గులకు గురవుతానేది వేచి చూడాల్సిందే.