Gold Rate Today: ఆల్ టైం రికార్డులు బద్దలు కొట్టిన బంగారం..తొలిసారి 80000 దాటిన తులం పసిడి ధర
Gold Rate Today: తులం బంగారం ధర చరిత్రలోనే తొలిసారిగా 80 వేల రూపాయలు దాటింది. దీంతో పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. 24 క్యారెట్ల బంగారం ధర నేడు రూ. 79,950 పలికింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,100 రూపాయలుగా ఉంది. బంగారం ధర భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ దీపావళి నాటికి పసిడి ధర కనీసం 85వేల రూపాయలకు చేరుతుందని ఇప్పుడు అంచనా వేస్తున్నారు.
ఇక ధన త్రయోదశి నాటికి కూడా బంగారం ధర భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పసిడి ప్రియులు ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బంగారం షాపింగ్ చేసే సమయంలో కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సూచిస్తున్నారు.
బంగారంలో మొత్తం రెండు రకాల వెరైటీలు ఉంటాయని ఈ సందర్భంగా పసిడి ప్రియులు తెలుసుకోవాల్సి ఉంటుంది. మొదటిది 24 క్యారెట్ల బంగారం. దీంతో కేవలం నాణ్యాలు కడ్డీలు బిస్కెట్లు మాత్రమే తయారు చేస్తారు. దీనిని మేలిమి బంగారం అని కూడా అంటారు ఇది ఆభరణాలు తయారు చేయడానికి పనికిరాదు. . ఈ లోహం కాస్త మెత్తగా ఉంటుంది. అందుకే ఈ బంగారం మేలిమి బంగారం గా చెబుతుంటారు.
రెండవది 22 క్యారెట్ల బంగారం . దీన్నే 916 కేడియం బంగారం అని కూడా అంటారు. ఈ లోహంతో బంగారు ఆభరణాలు తయారు చేస్తారు. అయితే మరి కొంచెం క్వాలిటీ తగ్గితే 18 క్యారెట్ల బంగారం కూడా ఉంటుంది. కొన్ని దుకాణాల్లో 22 క్యారెట్ల బంగారం అని చెప్పి 18 క్యారెట్ల బంగారు ఆభరణాలు విక్రయిస్తుంటారు. నిజానికి 22 క్యారెట్ల బంగారానికి 18 క్యారెట్ల బంగారం కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది.
దీంతో బంగారం ఆభరణాలు కొనుగోలు చేసేవారు మోసపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే మీరు బంగారం కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం కూడా హాల్ మార్క్ ఉన్న బంగారం మాత్రమే విక్రయించాలని ఇప్పటికే తయారీదారులకు జీవో జారీ చేసింది.
బంగారం ధర భారీగా పెరిగిన నేపథ్యంలో మీరు తప్పనిసరిగా కొనుగోలు చేసే సమయంలో తూకం సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. లేకపోతే పెద్ద మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం బంగారం పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఉన్న ధరలో ఒక తులం బరువున్న బంగారం చేను కొనుగోలు చేయాలంటే 85000 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే ఒక గ్రామ్ విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా ఉండాలి.