Gold Rate Today: మురిపించి..ఏడిపిస్తున్న బంగారం ధరలు..వరుసగా మరోసారి భారీగా పెరిగిన పసిడి ధర..లక్ష టార్గెట్ దిశగా పయనం
November 22 Gold Rates: బంగారానికి, భారతదేశానికి మధ్య ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే. సందర్భం ఏదైనా సరే మెడలో బంగారు ఆభరణాలు ఉండాల్సిందే. ముఖ్యంగా పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్స్ లో మహిళలు ఆభరణాలు ధరించలేకుండా ఉండాలేరు. అంతేకాదు చాలా మంది బంగారంపై పెట్టుబడులు కూడా పెడుతున్నారు. ఈకారణాలతో దేశంలో బంగారం ధరలు రోజురోజుకూ కొండెక్కి కూర్చొంటున్నాయి.
అమెరికా డాలర్ కాస్త బలహీన పడుతున్న సమయంలో బంగారం ధరలు మళ్లీ చుక్కలు చూపిస్తున్నాయి. గత రెండు సెషన్లలో మళ్లీ ఊహించని స్థాయిలో బంగారం ధర పెరిగింది. ఈ మధ్యే అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన అనంతరం డాలర్ బిట్ కాయిన్ వంటికి రికార్డు గరిష్టాలకు పెరగింది. అదే సమయంలో బంగారం మాత్రం పడిపోయింది.
ఆల్ టైమ్ గరిష్టాల నుంచి హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 71, 460 చేరుకుంది. గురువారం ఈ ధర రూ. 71,450 ఉంది. వంద గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగింది. దీంతో 7,14,600కి చేరుకుంది. గ్రాము బంగారం ధర ప్రస్తుతం రూ. 7, 146వద్ద కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల పసిడి ధర రూ. 10 పెరిగింది. 77,960కిచేరుకుంది. క్రితం రోజు ఈ ధర రూ. 77, 950గా ఉంది. అదే సమయంలో వంద గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 7, 79, 600 పలుకుతోంది.
అటుదేశంలోని కీలక ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 71,610 ఉండగా..24క్యారెట్ల బంగారం ధర రూ. 78, 110గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,460 ఉంది. 24క్యారెట్ల బంగారం 77,960ఉంది. ముంబై , బెంగళూరు, కేరళలోనూ ఈ ధరలే ఉన్నాయి.
ఇక హైదరాబాద్ లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,460ఉండగా 24క్యారెట్ల బంగారం ధర రూ. 77,960నమోదు అయ్యింది. విజయవాడలోనూ ఇవే ధరలు ఉండగా..విశాఖలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
ఇక దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం వందగ్రాముల వెండి ధర రూ. 9,910గా ఉంది. కేజీ వెండి ధర రూ. 100 తగ్గింది. రూ. 91,900 వద్ద కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 92,000 ఉంది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర రూ. 1,00, 900 పలుకుతోంది. వెండి ధరలు కోల్ కతాలో రూ. 91,900, బెంగళూరులో రూ. 91,900 ఉంది.