Gold Rate Today In Hyderabad 11 June 2021: బంగారం ధరలపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం, భారీగా పెరిగిన వెండి ధరలు
Gold Rate Today In India 11 June 2021: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గడంతో బంగారం ధరలు సైతం దిగొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ వెండి ధర భారీగా పెరిగింది. నేటి బంగారం, ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ (Gold Price Today In Hyderabad), విజయవాడ మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా దిగొచ్చింది. రూ.110 మేర తగ్గడంతో నేడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,970కు పతనమైంది. 22 క్యారెట్ల బంగారం ధర సైతం దిగిరావడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.45,800కు క్షీణించింది.
కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. రూ.120 మేర తగ్గడంతో ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,300కి పతనమైంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,950కి దిగొచ్చింది.
ఢిల్లీ మార్కెట్లో వెండి ధరలు భారీగా పుంజుకున్నాయి. ఢిల్లీలో రూ.1,000 మేర వెండి ధర పెరగడంతో నేడు 1 కేజీ వెండి ధర రూ.72,400కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో వెండి ధర పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో రూ.1,000 మేర పెరగడంతో 1 కేజీ ధర రూ.77,100కు చేరుకుంది.