Gold Price Today 21 May 2021: బులియన్ మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు, క్షీణించిన వెండి ధరలు
Gold Rate Update 21 May 2021: కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావం ఉన్నప్పటికీ గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర వరుసగా మూడోరోజు దిగొచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు పతనమయ్యాయి. బంగారం, వెండి లేటెస్ట్ రేట్స్ మీకోసం..
Also Read: Income Tax Returns 2020-21: ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పొడిగించిన సీబీడీటీ
Gold Rate Today In Hyderabad | తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా రూ.170 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,760కు చేరుకుంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,610 అయింది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర స్వల్పంగా పుంజుకుంది. తాజా రూ.120 మేర పెరగడంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,840కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,940 వద్ద ట్రేడింగ్ అవుతోంది.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరింత ఆలస్యం
దేశ రాజధాని ఢిల్లీలో బులియన్ మార్కెట్‌లో వెండి ధర వరుగా మూడోరోజు భారీగా దిగొచ్చింది. వెండి ధర రూ.1,100 మేర పతనం కావడంతో తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.71,200కు క్షీణించింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.500 మేర పతనమైంది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.76,400 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook