Gold Rate Today In Hyderabad: బులియన్ మార్కెట్లో స్థిరంగా బంగారం ధరలు, మిశ్రమంగా వెండి ధరలు
Gold Rate Update 24 May 2021: కరోనా సెకండ్ వేవ్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వరుసగా మూడోరోజు బంగారం ధరలలో ఏ మార్పు లేదు. లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ ప్రభావంతో గత వారాంతపు ధరల వద్ద మార్కెట్ అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వెండి ధర స్వల్పంగా పెరగగా, ఢిల్లీలో వెండి ధరలు స్థిరంగా ఉంది. బంగారం, వెండి లేటెస్ట్ రేట్స్ మీకోసం..
Gold Rate Today In Hyderabad | తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వరుసగా మూడోరోజు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,750 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.45,600 వద్ద మార్కెట్ అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో ఇటీవల స్వల్పంగా పుంజుకున్న బంగారం తాజాగా స్థిరంగా మార్కెట్ అవుతోంది. వరుసగా మూడో రోజు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,830 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,930 వద్ద మార్కెట్ అవుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో బులియన్ మార్కెట్‌లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. వెండి ధర రూ.100 మేర పెరగడంతో తాజాగా ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.71,200కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్థిరంగా ఉంది. నేడు హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.75,700 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.