Gold News: పెళ్లిళ్ల సీజన్ ముందు సీన్ రివర్స్.. పసిడి ప్రియులకు బిగ్ షాక్..మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర..ఎంత పెరిగిందంటే
Gold Price Today: అమెరికా డాలర్ కాస్త బలహీన పడుతున్న సమయంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతూ బంగారం ప్రియుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. గత రెండు సెషన్లలో మళ్లీ ఊహించన రీతిలో ధరలు పెరిగాయి. ఈమధ్యే అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత..డాలర్, బిట్ కాయిన్ వంటివి రికార్డు గరిష్టాలకు పెరిగాయి.
ఇదే సమయంలో బంగారం మాత్రం పడిపోయింది. ఆల్ టైమ్ గరిష్టాల నుంచి హైదరాబాద్ లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 5500కు పైగా పతనం అయ్యింది. అయితే సీన్ రివర్స్ అయ్యింది. పది పదిహేను రోజుల వరకు తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ పుంజుకోవడం ప్రారంభమయ్యాయి. అసలే ఇప్పుడు దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఈ క్రమంలో డిమాండ్ పెరిగి ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.
హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 700పెరిగింది. దీంతో తులం బంగారం ధర రూ. 70,650 మార్కుకు చేరుకుంది. దీనికి ముందు రోజు కూడా రూ. 600 పెరిగింది. ఇక 24క్యారెట్ల బంగారం ధర రూ. 760 పెరిగి పదిగ్రాములకు ఇప్పుడు రూ. 77, 070 వద్ద కొనసాగుతోంది.
ఇది కూడా మునపటి రోజు రూ. 660 వరకు పెరిగింది. దీంతో రెండు రోజుల్లో రూ. 1420 పెరిగింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే..రూ. 700 పెరిగిన 22క్యారెట్ల బంగారం ధర ప్రస్తుతం పది గ్రాములకు రూ. 70, 800 వరకు చేరుకుంది. ఇక 24క్యారెట్ల బంగారం ధర తులం రూ. 77, 220 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు బంగారం ధరల బాటలోనే వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 2వేలు పెరిగి ప్రస్తుతం రూ. 91,500 మార్కును తాకింది. దీనికి ముందు దాదాపు 15రోజులు ధరే పెరగలేదు. ఇప్పుడు మాత్రం పెరిగింది.
ఇక హైదరాబాద్ నగరంలో చూస్తే ఇక్కడ రూ. 2వేలు పెరగడంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1.01 లక్షలు పలుకుతోంది. బంగారం, వెండి ధరలు ప్రాంతాలను మారుతుంటాయి. మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటే ధరలను ముందుగా తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిది.