Gold News: ఎవరెస్టు రేంజులో పెరుగుతున్న బంగారం ధర.. మహిళలకు ఇక కన్నీళ్లే.. లక్ష దిశగా తులం పసిడి పరుగులు
Gold Rate: బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగారం ధర రికార్డు స్థాయిని తాకింది. బంగారం పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్న పరిణామాలను కారణాలుగా చెప్పవచ్చు. బంగారం ధరలు అక్టోబర్ 23, బుదవారం గమనిస్తే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 80,700 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 73800 రూపాయలు పలుకుతోంది.
అయితే ప్రస్తుతం బంగారం ధర రికార్డు స్థాయి వద్ద ఉంది. ఈ స్థాయి నుంచి బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధర పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయంగా ఉన్న కారణాలను పేర్కొనవచ్చు. పసిడి ధరలు పెద్ద ఎత్తున పెరగడానికి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో పాటు, చైనా తైవాన్ మధ్య ఉద్రిక్తతలు కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు బంగారం ధరలను ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అమెరికాలో ఇప్పటికే బంగారం ధర ఒక ఔన్సు 2750 డాలర్లు దాటింది. దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అటు అంతర్జాతీయంగా పలు దేశాలు బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాయి. వీటిలో చైనా అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేస్తోంది.
దీంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పసిడి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో బంగారు ఆభరణాల కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈసారి ప్రపంచ అనిశ్చితి కారణంగా బంగారం ధర చాలా వేగంగా పెరిగింది. దేశీయం గానూ, అంతర్జాతీయం గానూ ధరలు ఎన్నడూ లేనంతగా ఉన్నాయి.
పెరుగుతున్న ధరల కారణంగా ఈ సారి ఫెస్టివల్ సీజన్ లో బంగారు ఆభరణాల కొనుగోలు విషయంలో వినియోగదారుల ఆసక్తి కొంత తగ్గిందని కామ్‌ట్రెండ్జ్ రీసెర్చ్ సహ వ్యవస్థాపకుడు, CEO జ్ఞానశేఖర్ త్యాగరాజన్ PTI వార్తా సంస్థతో తెలిపారు. అయితే, కొంత కాలం తర్వాత పెరిగిన ధరలకు అలవాటుపడిన జనం మళ్లీ ఆభరణాలు కొనుగోలు చేస్తారని, క్రమంగా డిమాండ్ పెరుగుతుందని పేర్కొన్నారు.
బంగారం ధరలు పెరిగినప్పటికీ, పండుగ సీజన్‌లో విక్రయాలపై ఆశాజనకంగా ఉన్నామని ఆభరణాల విక్రయదారు కళ్యాణ్ జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ టిఎస్ కళ్యాణరామన్ తెలిపారు. పండుగలకు ముందస్తు ఆర్డర్లు కూడా బాగానే కనిపిస్తున్నాయన్నారు.
బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరినప్పటికీ ధన త్రయోదశి, దీపావళి పండుగల కారణంగా మళ్లీ బంగారం కొనుగోళ్లు ఊపందుకున్న సూచనలు కనిపిస్తున్నాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీజినల్ సీఈఓ (ఇండియా) సచిన్ జైన్ అన్నారు. అయితే బంగారం ధర ఈ ఏడాది చివరి నాటికి రూ.90000 రూ. 1 లక్ష మధ్యలోకి చేరే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.