Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధర.. చరిత్రలో ఇంత రేటు ఎప్పుడు లేదు..
Gold Rate Today octomber 3rd: బంగారం ధర రికార్డు స్థాయిలో పెరగడానికి ప్రధానంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న యుద్ధ వాతావరణం కూడా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న యుద్ద వాతావరణ కారణంగా ప్రపంచ వాణిజ్యం కుంటూ పడే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో క్రూడ్ ఆయిల్ ఎగుమతులకు ఈ యుద్ధ వాతావరణం ఆటంకం కలిగించే అవకాశం ఉంటుంది.
దీంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగే వీలుంది. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి. ఫలితంగా ప్రపంచ వాణిజ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. పలు దేశాలు ఎక్కువ డాలర్లను క్రూడ్ ఆయిల్ కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో ఆయా దేశాల కరెంట్ ఖాతా లోటు పెరుగుతుంది. ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
ఈ కారణంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ వంటి ఈక్విటీ మార్కెట్ నుంచి సేఫ్ పెట్టుబడిగా భావించే బంగారం వైపు తరలించే అవకాశం ఉంటుంది. ఫలితంగా బంగారం ధరలు డిమాండ్ పెరిగి భారీగా ధర పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇదే జరుగుతుంది. అమెరికాలో కూడా బంగారం ఒక ఔన్సు ధర 2700 డాలర్లు దాటింది. ఈ ధర చరిత్రలోనే ఆల్ టైం రికార్డ్ స్థాయి అని చెప్పవచ్చు.
బంగారం ధరలు వరుసగా పెరగడంతో పసిడి ప్రియులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా ఆభరణాలు కొనుగోలు చేసేవారు తులం 78000 దాటడంతో ఏం చేయాలో తెలియక వాపోతున్నారు. ఇక ఆభరణాలు చేసుకునే బంగారం 22 క్యారెట్లకు గాను గతంలో తక్కువగా ఉండేది. ఇప్పుడు దీని ధర కూడా 72,000 సమీపానికి చేరింది.
దీంతో ఒక చిన్న నగ చేయించుకోవాలన్నా కూడా లక్ష రూపాయల పైన ఖర్చు అయ్యే పరిస్థితి ఏర్పడింది. పసిడి ధరలు ఈ రేంజ్ లో పెరగడంతో ఎప్పుడు మళ్ళీ దిగివస్తుందా మంచి రోజులు ఎప్పుడు వస్తాయని పసిడి ప్రియులు ఎదురుచూస్తున్నారు.
అయితే అటు నిపుణులు మాత్రం ఇప్పట్లో పసిడి దిగివచ్చే ఆశలు లేవని, ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధర ఒక తులం లక్ష రూపాయలు అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని ముందుగానే హెచ్చరిస్తున్నారు.