GOld Rate Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు బంగారం ధర ఎలా ఉందంటే
బంగారం ధరలు నిన్నటితో పోల్చి చూస్తే నేడు స్వల్పంగా తగ్గాయి. సెప్టెంబర్ 4 బుధవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,770 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66,700గా నమోదవుతోంది. బంగారం ధరలు భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశం ఉందని కూడా బులియన్ పండితులు విశ్లేషిస్తున్నారు.
ముఖ్యంగా పసిడి ధరలు పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లలో ఉన్న అనిశ్చితి కూడా కారణంగా చెబుతున్నారు. అమెరికా మార్కెట్లలో బంగారం ధరలు పెరిగేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే అమెరికాలో కీలక జాబ్స్ డేటా విడుదలకు సిద్ధంగా ఉంది.
ఇది కనుక తగ్గుదల సూచిస్తే మాత్రం బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనికి తోడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు కూడా పావు శాతం మీద తగ్గించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇది కనుక జరిగితే బంగారం ధర మరోసారి భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది.
పసిడి ధరలు దేశీయంగా కూడా పలు కారణాలవల్ల హెచ్చుతగ్గులకు గురవుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రస్తుతం శ్రావణమాసం ముగియడంతో దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ ముగిసింది. అయితే మళ్లీ ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కానుంది దసరా, దీపావళి సందర్భంగా బంగారం పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
ఈ నేపథ్యంలో బంగారం ధరలు ఈ ఫెస్టివల్ సీజన్లో 75 వేల స్థాయిని దాటి ఆల్ టైం గరిష్ట స్థాయిని నమోదు చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అదే కొనసాగినట్లయితే బంగారం నూతన గరిష్ట స్థాయిని అందుకునే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే బంగారం కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైం గరిష్ట స్థాయి వద్ద ఉన్నాయి ఒక గ్రాము తేడా వచ్చిన భారీ ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. కావున బంగారు నగల షాపింగ్ చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా హాల్ మార్క్ బంగారం కొనుగోలు చేస్తున్నామా లేదా అన్న విషయం గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం హాల్ మార్క్ ఉన్న బంగారాన్ని తప్పనిసరి చేసింది. ఒకవేళ మీరు హాల్ మార్క్ లేని బంగారం ఏ దుకాణంలో అయినా చూసినట్లయితే వెంటనే ఫిర్యాదు చేయవచ్చు.