Gold Rate Today: సెప్టెంబర్ 23 సోమవారం బంగారం ధరలు..నేడు తులం బంగారం ధర ఎంతంటే?
Today Gold Rate September 23,2024: నేడు సెప్టెంబర్ 23వ తేదీ బంగారం ధర స్వల్పంగా పెరిగింది. నేడు 24 క్యారట్ల బంగారం 75,970 రూపాయలుగా ఉంది. 22 క్యారట్ల బంగారం ధర 69,600 రూపాయలుగా ఉంది. బంగారం ధర ఆకాశమే హద్దుగా రాకెట్ కన్న వేగంతో దూసుకెళ్తోంది. గతంలో ఎప్పుడు లేనంత విధంగా బంగారం ధర ఇప్పుడు రికార్డును సృష్టించింది.
ఇదే వేగంతో వెళితే బంగారం తులం ధర ఒక లక్ష రూపాయలు దాటుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బంగారం ధరలు పెరగడానికి దేశీయంగా కన్నా కూడా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే అసలు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో సాగుతున్నటువంటి ఎన్నికలు బంగారం ధరలు పెంచడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
ఎందుకంటే అమెరికాలో ఎన్నికలు కారణంగా స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులకు లోన అయ్యే ప్రమాదం ఉంటుంది. దీంతో బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తూ ఉంటారు. ఫలితంగా బంగారం ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బంగారం ధర అమెరికాలో ఒక ఔన్సుకు 2650 డాలర్లుగా ఉంది.
ఈ ధర దాదాపు ఆల్ టైం రికార్డ్ స్థాయి అని చెప్పాలి. బంగారం ధర భవిష్యత్తులో మరో 200 నుంచి 300 డాలర్లు పెరగవచ్చు అని నిపుణులు చెప్తున్నారు. ఇదే కనుక సాగితే బంగారం ధర మన దేశంలో కూడా దాదాపు 80000 రూపాయలు తాకే అవకాశం ఉంటుంది.
ఇక మన దేశంలో దసరా, దీపావళి, ధన త్రయోదశి వంటి పండగలు రానున్నాయి. ఈ సందర్భంగా పసిడి ప్రియులు పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో చాలా జాగ్రత్తగా కొనుగోలు చేయాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒక గ్రాము తేడా వచ్చినా కూడా 7600 నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దీని దృష్టిలో ఉంచుకొని మీరు బంగారం తూకం విషయంలోనూ నాణ్యత విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అన్ని నగల దుకాణాలు తప్పనిసరిగా హాల్ మార్క్ నగలను మాత్రమే విక్రయించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే మీరు కూడా ఎంత చిన్న నగ కొనుగోలు చేసిన దానిపై హాల్ మార్క్ ఉందా లేదా అని నిర్ధారించుకోవాలి.
ఇక బంగారం ఆభరణాలను కొనుగోలు చేసే సమయంలో క్వాలిటీ విషయంలో తప్పనిసరిగా టెస్ట్ చేయించుకోవాలి. లేకపోతే మీరు భారీ మొత్తంలో నష్టపోయే ప్రమాదం ఉంటుంది.