Vastu Lucky Plants: ఇంట్లో, ఇంటి పరిసరాల్లో ఈ 6 మొక్కలుంటే..అంతా శుభమే, అందరిళ్లలో సుఖ సంతోషాలు
తులసి మొక్క
హిందూమతంలో తులసి మొక్కకు విశేషమైన ప్రాధాన్యతత మహత్యమున్నాయి. ఇంటి ఆవరణలో తులసి మొక్క ఉందంటే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని అర్ధం. ఏ విధమైన సమస్యలు ఉండవు.
స్పైడర్ ప్లాంట్
స్పైడర్ ప్లాంట్ అనేది వాస్తవానికి ఓ ఇండోర్ ప్లాంట్ దీని గాలి చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఇది ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా మంచిది. ఇతరత్రా సమస్యలు కూడా దూరమౌతాయి.
షమీ చెట్టు
షమీ చెట్టు అనేది సాధారణంగా రోడ్లపై ఉండేదే. ఇంటి ఆవరణలో ఈ చెట్టు ఉంటే శివుడి కటాక్షం లభిస్తుందంటారు. ఎందుకంటే ఈ చెట్టు శివుడికి ప్రీతిపాత్రమైంది. దీనివల్ల శని దేవుడి అశుభ ప్రభావం ఉండదు.
మనీ ప్లాంట్
మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో చాలామంది పెంచుకుంటారు. సక్రమ పద్దతిలో పెంచుకుంటే ఆ ఇంట్లో డబ్బు సంబంధిత సమస్యలు ఉండవని అర్ధం. ఆదాయం, అటు లాభాలు కూడా పెరుగుతాయని భావం
అపరాజిత మొక్క
తులసి మొక్కలానే అపరాజిత మొక్కను హిందూవులు అత్యంత పవిత్రంగా పిలుస్తారు. ఈ మొక్క ఇంటి పరిసరాల్లో ఉంటే లక్ష్మీ దేవి కటాక్షం ప్రాప్తిస్తుందని అర్ధం.