PM Kisan yojana: కోట్లాది మంది రైతులకు మోదీ నవరాత్రి కానుక.. ఖాతాల్లో డబ్బులు జమా మీకు వచ్చాయా? వెంటనే చెక్‌ చేసుకోండి..

Sat, 05 Oct 2024-4:50 pm,

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మన్‌ నిధి యోజన ద్వారా ప్రతి ఏడాది రైతుల ఖాతాల్లో డబ్బులు జమా చేస్తూ వస్తుంది. 17వ విడత డబ్బులను జూన్‌లోనే విడుదల చేశారు. ఈ సందర్భంగా 18వ విడత డబ్బులను ఈరోజు అక్టోబర్ 5న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేరుగా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ (DBT) రిమోట్‌ నొక్కి వారి ఖాతాల్లో జమా చేశారు.   

ప్రతి ఏడాది మూడుసార్లు రూ.2000 చొప్పున కేంద్రం పీఎం కిసాన్‌ పథకం ద్వారా డబ్బులను రైతుల ఖాతాల్లో జమా చేస్తోంది. ఈ పథకం ప్రధాన ఉద్యేశం చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకాన్ని ఎన్‌డీఏ ప్రభుత్వం 2019లో ప్రారంభించింది.  

ఈరోజు మహారాష్ట్రలోని వాషిమ్‌ జిల్లాలో జరిగిన సమావేశానికి హాజరైన పీఎం మోడీ ఈ  నిధుల డబ్బులను విడుదల చేశారు. దీంతో 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున మొత్తం 20 వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా జమా అయింది. దీంతో పండుగ ముందు రైతుల ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ పథకాన్ని ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకుంటున్నాడు.  

ముఖ్యంగా రెండు హెక్టర్లు లేదా అంతకంటే తక్కువ సాగు భూమి ఉన్న రైతుల సంక్షేమం కోసం ప్రారంభించారు. ఈ పథకానికి ప్రతి ఏటా కేంద్రం రూ.6 వేల కోట్లను కేటాయిస్తుంది. ప్రతి నాలుగు నెలలకు ఒక్కసారి రూ.2000 డీబీటీ ద్వారానే జమా చేస్తూ వస్తోంది.  

అయితే, ఈ పథకం ద్వారా లబ్ది పొందాలంటే ఇకేవైసీ, భూరికార్డులు వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకానికి సంబంధించి ఏవైనా సమస్యలు ఏర్పడితే pmkisan-ict@gov.in మెయిల్‌ పంపవచ్చు.  

ఇకేవైసీ పూర్తి చేసుకోని రైతులు వెంటనే పూర్తి చేసుకోవాలి. తద్వారా వారు కూడా డీబీటీ ద్వారా పీఎం కిసాన్‌ యోజనకు అర్హులు అవుతారు. దీనికి అధికారిక వెబ్‌సైట్‌ http://pmkisan.gov.in ద్వార అప్లై చేసుకోవాలి.  

పీఎం కిసాన్‌ యోజన డబ్బులు జమా అయినవారికి మెసేజ్‌ కూడా వస్తంది. మీ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు డబ్బులు క్రెడిట్‌ అయినట్లు వస్తుంది. లేకపోతే కూడా పైన సూచించిన వెబ్‌సైట్‌ ద్వారా మీ స్టేటస్‌ను చెక్‌ చేసుకోవచ్చు. ఆధార్‌ కార్డు, రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌ తప్పకుండా కలిగి ఉండాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link