EPFO: ఈపీఎఫ్‌ ఖాతాదారులకు బంపర్‌ న్యూస్‌.. ఇంట్లోనే కూర్చుని ఈ పని పూర్తి చేసుకోవచ్చు!

Mon, 21 Oct 2024-1:55 pm,

ఈపీఎఫ్‌ఓ పెన్షనర్లు ప్రతి ఏడాది జీవన్ ప్రమాణ్‌ సర్టిఫికేట్‌ సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని పోస్ట్ ఆఫీసు లేదా సంబంధిత బ్యాంకుల్లో సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది. అయితే, వృద్ధులకు ఈ విధానం భారం కాకుండా ఇంట్లో కూర్చొని సింపుల్‌గా ఆన్‌లైన్‌లోనే లైఫ్‌ సర్టిఫికేట్‌ను అందించే సదుపాయాన్ని కల్పిస్తోంది.  

డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ అంటే సదరు పెన్షన్‌దారుడు బతికే ఉన్నాడని నిరూపించే ఓ ఆన్‌లైన్‌ డాక్యుమెంట్‌. ప్రతి నెలా పెన్షన్‌ పొందాలంటే ఏడాదికి ఒకసారి కచ్చితంగా లైఫ్‌ సర్టిఫికేట్‌ పింఛనుదారుడు సమర్పించాల్సి ఉంటుంది. లేదంటే పెన్షన్‌ రాకుండా పోతుంది.  

ఈ డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికేట్‌ పొందాలంటే మీకు ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ అథంటికేషన్‌ సిస్టం కలిగి ఉండాలి. దీన్నిజీవన్‌ ప్రమాణ్‌ యాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆధార్‌ కార్డు నంబర్‌, బ్యాంకు ఖాతా వివరాలు, పేరు, మొబైల్‌ నంబర్‌, పింఛను చెల్లింపులకు సంబంధించిన వివరాలు నమోదు చేయాలి.  

జీవన్‌ ప్రమాణ్‌ ఇలా సబ్మిట్‌ చేయడం ఎంతో సులభం. మీ డేటాను ఆధార్‌ వెరిఫై చేస్తుంది. ఒకవేళ మీరు కూడా పీఎఫ్ పింఛను దారులు అయితే, నవంబర్‌ 30 లోగా జీవన్‌ ప్రమాణ్‌ సర్టిఫికేట్‌ను కచ్చితంగా సబ్మిట్‌ చేయాలి. లేకపోతే పింఛను నిలిపివేస్తారు. మీ డేటా భద్రంగా ఉంటుంది. ఇంట్లో కూర్చొని సులభంగా చేసుకోవచ్చు.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link