UMID Card: రైల్వే ఉద్యోగులకు భారీ శుభవార్త.. ఈ రూ. 100 కార్డుతో నేరుగా ఎయిమ్స్‌లో చికిత్స..!
ఇది పనిచేస్తున్న ఉద్యోగి, పింఛను దారులు, వారి కుటుంబ సభ్యులకు కూడా అందించనుంది. దీంతో వారు రైల్వే ప్యానెల్‌తోపాటు ఏయిమ్స్ (ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో కూడా చికిత్స పొందవచ్చు. ఈ కార్డును రూ.100 ఇవ్వనున్నారు. ఇది దాదపు 12.5 లక్షల ఉద్యోగులకు లాభాదాయకం. అదేవిధంగా 15 లక్షల పింఛనుదారులకు, రూ. 10 లక్షల మంది కుటుంబ సభ్యులు కూడా లబ్దిపొందనున్నారు.
రైల్వే ఉద్యోగుల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదుల తర్వాత ఈ కార్డును ప్రారంభించనుంది. ముఖ్యంగా వారి ఫిర్యాదులో వైద్యులు కేవలం వారికి ఇష్టం వచ్చిన ఆస్పత్రులకే రిఫర్ చేస్తున్నారనే అనేక మంది ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. ఈ కొత్త పాలసీ విధానంలో ఆ సమస్య ఉండదు.
ఏ డాక్టర్ రిఫరెన్స్ లేకుండా మెడికల్ సదుపాయాలు ఉద్యోగులు పొందనున్నారు. ముఖ్యంగా చంఢిగఢ్‌లోని పీజీఐఎంఈఆర్, జేఐపీఎంఈఆర్ పుదుచ్చేరీ, ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్ బెంగళూరు, ఇంకా మన దేశలోని 25 ఎయిమ్స్ ఆస్పత్రుల్లో కూడా వైద్యం సులభంగా పొందవచ్చు. ఈ కార్డు ద్వారా కేవలం వైద్యం మాత్రమే కాదు మందులు కూడా పొందుతారు.
రైల్వే బోర్డు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (ట్రాన్సఫర్మెషన్) ప్రణవ్ కుమార్ మాలిక్ సోమవారం ఈ యూనిక్ మెడికల ఐడెంటిఫికేషన్ కార్డు గురించి మాట్లాడుతూ ఈ కార్డు త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ కార్డును హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మెషన్ సిస్టం (HMIS) ద్వారా డిజీలాకర్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఇది ఉద్యోగులు, పింఛనుదారుల ప్రొఫైల్ లో కూడా అందుబాటులో ఉంచనున్నారు.
ఈ కార్డు ద్వారా రైల్వే ఉద్యోగులు, పింఛనుదారులు, వారి కుటుంబసభ్యులు కూడా రైల్వే ప్యానెల్‌లో అందుబాటులో ఉన్న హాస్పిటల్ లేదా డయాగ్నస్టిక్ సెంటర్లలో చికిత్స పొందవచ్చు. ఈ కార్డును జనరల్, ఎమర్జెన్సీ చికిత్స కూడా పొందవచ్చు. UMID కార్డు లేనివారు ఆ నంబర్ ఉంటే కూడా చికిత్స పొందవచ్చు.