DA Hike Bonus Salary: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి డబుల్ ధమాకా.. భారీగా జీతాల పెంపు..!
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలలో ఒకటి రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఉద్యోగులకు కాస్త ఊరట కలిగించినట్లయింది.
తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగులకు గ్రాట్యుటీ ప్రకటించింది. 53 శాతం గ్రాట్యూటీ ప్రకటించిన స్టాలిన్ సర్కార్.. జూలై 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉద్యోగులకు బంపర్ న్యూస్ ప్రకటించారు. గ్రాట్యుటీ పెంపుతో పాటు దీపావళి బోనస్‌ను కూడా అందజేస్తామన్నారు. దీంతో ఉద్యోగులకు ఒక నెల అదనపు జీతం అందనుంది. రూ.7 వేల వరకు బోనస్ కూడా ప్రభుత్వం అందజేయనుంది.
గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ క్లాస్ IV ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు. రూ.7 వేల వరకు పండుగ బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా ఉద్యోగులకు 3 శాతం గ్రాట్యుటీ పెంచుతున్నట్లు తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుక అందజేసింది. గ్రాట్యుటీలో 3 శాతం అందిస్తున్నట్లు ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మోదీ సర్కారు బంపర్ గిఫ్ట్ ఇచ్చింది. 3 శాతం డీఏ పెంచుతూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా వివిధ శాఖల ఉద్యోగులకు నెల జీతానికి సమానమైన నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ అందజేస్తున్నట్లు ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 53 శాతానికి చేరింది. జూలై 1వ తేదీ నుంచి అమలు చేసింది. దీంతో ఉద్యోగుల ఖాతాల్లో ఒకేసారి భారీ మొత్తం డబ్బులు జమకానున్నాయి.