8th Pay Commission Salary Hike: ఇది కదా ఉద్యోగులకు కావాల్సింది.. అదే జరిగితే ఒకేసారి 186 శాతం జీతాలు పెంపు..!

Wed, 27 Nov 2024-2:49 pm,

7వ వేతన సంఘం ప్రకారం.. ఉద్యోగుల బేసిక్ పే రూ.18 వేలుగా ఉంది. 8వ వేతన సంఘం అమలులోకి వస్తే.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ 2.86 అవుతుందని అంచనా వేస్తున్నారు.   

దీంతో ఉద్యోగుల జీతం 186 శాతం పెరిగి దాదాపు రూ.51,480కి చేరుతుందని నిపుణులు చెబుతున్నారు.   

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపు ఉద్యోగులకు జీతాలు భారీగా పెరగడంతోపాటు పెన్షనర్లకు కూడా భారీ లబ్ధి చేకూరనుంది. పెన్షన్‌ కూడా భారీ మొత్తంలో పెరగనుంది.   

186 శాతం పెరుగుదలతో రూ.25,740కి చేరుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పెన్షన్‌ రూ.9 వేలు అందుకుంటున్న విషయం తెలిసిందే. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 అయితే పెన్షన్ రూ.25,740 అవుతుంది.  

ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటుపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. మోదీ సర్కారు వచ్చే బడ్జెట్‌లో ప్రటించే ఛాన్స్ ఉందని అంటున్ననారు.  

గత బడ్జెట్‌లోనే కొత్త పే కమిషన్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. అయితే కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.  

డిసెంబర్‌ నెలలో జాతీయ కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఎనిమిదో వేతన సంఘం అమలుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సమావేశం నవంబర్‌లో నిర్వహించాల్సి ఉండగా.. డిసెంబర్ నెల‌కు వాయిదా వేశారు.  

7వ వేతన సంఘం అమలుతో ఉద్యోగుల జీతాలు, పెన్షనర్లు పెన్షన్‌ భారీగా పెరిగింది. ప్రతి పదేళ్లకు కొత్త పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే కచ్చితంగా ఏర్పాటు చేయాలనే నిబంధనలు అయితే ఏమి లేవు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.   

గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే రాసినది. జీతాల పెంపు, కొత్త పేమిషన్ ఏర్పాటు గురించి కచ్చితమైన సమాచారం కోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయండి.      

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link