Gratuity Updates: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాక్ పాట్, గ్రాట్యుటీ 25 లక్షలకు పెంపు
కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వుల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం సైతం గ్రాట్యుటీ పరిమితిని 20 లక్షల నుంచి 25 లక్షలకు పెంచింది. ఈ నిర్ణయం ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్ రేటును 46 శాతం నుంచి 50 శాతానికి పెంచింది. రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ కూడా పెంచినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
ఉద్యోగుల గ్రాట్యుటీని 20 నుంచి 25 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సంబంధింతిన ప్రత్యేక ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. రాష్ట్ర ఆర్ధిక శాఖ కార్యదర్శి డి ఉదయ చంద్రన్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
కేంద్ర ప్రభుత్వం పెంచడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగుల గ్రాట్యుటీని 25 లక్షలకు పెంచింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటి వరకూ గ్రాట్యుటీ 20 లక్షలు ఉండేది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల గ్రాట్యుటీని 25 లక్షలకు పెంచింది. డెత్ గ్రాట్యుటీ పరిమితిని 25 శాతం పెంచింది. ఈ ఏడాది జనవరి 1 నుంచే ఇది అమల్లో ఉంటుంది.
తమిళనాడులో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ విధానం యాక్టివ్ లో ఉంది. 2003 ఏప్రిల్ 1 తరువాత చేరినవారికి ఇది వర్తిస్తోంది. అంతకంటే ముందు చేరినవారికి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉంటుంది. రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ కూడా పాత పెన్షన్ విధానంలోనే చెల్లిస్తారు