Google 2024 Top Trending Searches for Movies: 2024 గూగుల్ టాప్ ట్రెండ్ మూవీస్ లో హనుమాన్, కల్కి మూవీస్..
గూగుల్ 2024లో టాప్ 10లో మూడు తెలుగు సినిమాలకు చోటు దక్కింది. అందులో ప్రభాస్ నటించిన ‘కల్కి’తో పాటు సలార్ సినిమాలు ఉండటంతో పాటు హనుమాన్ సినిమాకు చోటు దక్కడం విశేషం.
1. స్త్రీ 2.. శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించిన ‘స్త్రీ 2’ మూవీ ఈ యేడాది లేడీ ఓరియెంటెడ్ మూవీస్ లో టాప్ లో నిలిచింది.
2. కల్కి 2898 AD.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా ఈ యేడాది గూగుల్ టాప్ మూవీస్ లో 2వ ప్లేస్ లో నిలిచింది.
3.12Th ఫెయిల్.. విక్రాంత్ మస్సే హీరోగా నటించిన చిత్రం 12th ఫెయిల్ మూవీ గూగుల్ టాప్ ట్రెండ్ మూవీస్ లో టాప్ 3లో నిలిచింది.
4. లాపతా లేడీస్.. ఆమీర్ భార్య కిరణ్ రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా గూగుల్ టాప్ ట్రెండ్ లో 4వ స్థానంలో నిలిచింది.
5.హనుమాన్ .. హనుమాన్ మూవీ ఈ యేడాది ఎక్కువ మంది సెర్చ్ చేసిన మూవీస్ లో టాప్ 5లో నిలిచింది.
6. మహారాజా .. విజయ్ సేతుపతి హీరోగా నటించిన తమిళ చిత్రం ‘మహారాజా’. ఈ యేడాది టాప్ 6లో నిలిచింది.
7.మంజుమ్మేల్ బాయ్స్ .. మలయాళ మూవీ మంజుమ్మేల్ మూవీ ఈ యేడాది గూగుల్ టాప్ ట్రెండింగ్ మూవీస్ లో 7వ స్థానంలో నిలిచింది.
8.గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ )..విజయ్ హీరోగా నటించిన చిత్రం ‘గోట్’. ఈ సినిమా ఈ యేడాది గూగుల్ టాప్ ట్రెండ్ లో టాప్ 8లో నిలిచింది.
9. సలార్.. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సలార్’. ఈ సినిమా గతేడాది విడుదలైన గూగుల్ టాప్ ట్రెండ్ లో ఈ చిత్రం టాప్ 9లో నిలిచింది.
10. ఆవేశం.. ఫహద్ ఫాజిల్ నటించిన మలయాల మూవీ ‘ఆవేశం’ ఈ యేడాది గూగుల్ టాప్ ట్రెండ్ లో 10వ స్థానంలో నిలిచింది.