Google 2024 Top Trending Serches for Overall: 2024లో గూగుల్ టాప్ ట్రెండ్ లో ఐపీఎల్.. ట్రెండింగ్ లో బీజేపీ పార్టీ..

Wed, 11 Dec 2024-2:00 am,

1.ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్).. ఈ యేడాది (2024) ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను  ఎక్కువ మంది భారతీయులు సెర్చ్ చేసిన పదం అని గూగుల్ తెలిపింది. 

2. T20 World Cup: ఈ యేడాది మన దేశ ప్రజలు  గూగుల్ ఐపీఎల్ తర్వాత గూగుల్ లో ఎక్కువ మంది ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ ను ఎక్కువ మంది వెతికినట్టు గూగుల్ ఇండియా తెలిపింది.

3.భారతీయ జనతా పార్టీ.. 2024 ఎన్నికల్లో బీజేపీ పార్టీ చెప్పినట్టుగా 400 సీట్లు కాకుండా.. 240 సీట్లకే పరిమితం అయింది. అంతేకాదు వరుసగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చి సంచలనం రేపింది.

4. ఎలక్షన్ రిజల్ట్ 2024.. 2024లో మన దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ లో ఈ ఎన్నికల ఫలితాలు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేశాయి. ఎక్కువ మంది ఈ రిజల్ట్ కోసం గూగుల్ లో సెర్చ్ చేసినట్టు చెప్పుకొచ్చారు.

5.ఒలింపిక్స్.. 2024 ఫ్రాన్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో భారత దేశం తరుపున పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో వినేశ్ ఫొగాట్ ఇష్యూతో ఒలింపిక్స్ టాప్ ట్రెండింగ్ లో 5వ స్థానంలో నిలిచింది.

6.ఎక్స్ సెవ్ హీట్..2024 గూగుల్ టాప్ ట్రెండ్ లో ఎక్సెసివ్ హీట్ టాప్ లో నిలిచింది.

7.రతన్ టాటా.. టాటా గ్రూపుకు చైర్మన్ గా పనిచేసిన రతన్ టాటా తనువు చాలించిన నేపథ్యంలో ఆయన పేరు మన భారతీయులు ఎక్కువగా గూగుల్ లో సెర్చ్ చేసారు.

8.ఇండియన్ నేషనల్ కాంగ్రెస్.. దేశాన్ని సుధీర్ఘ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో 99 స్థానాల్లో గెలిచి పదేళ్ల తర్వాత ప్రతిపక్ష స్థానాన్ని దక్కించుకుంది.

9.ప్రో కబడ్డీ లీగ్.. 2024 గూగుల్ లో ప్రో కబడ్డీ లీగ్ టాప్ ట్రెండింగ్ లో టాప్ 9లో నిలిచింది.

 

10.ఇండియన్ సూపర్ లీగ్..  ఇండియర్ సూపర్ లీగ్ ఓవరాల్ గా మన దేశంలో టాప్ 10లో నిలిచింది. మొత్తంగా టాప్ 10లో టాప్ 5 క్రీడలకు సంబంధించిన అంశాలే ఉండటం విశేషం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link