Google Pixel 7: Google Pixel ది బెస్ట్ ఫోన్ ఇదేనా.. ఎందుకంత ప్రత్యేకత ఈ ఫోన్‌లకి..
పిక్సెల్ 7 రెండూ మూడు కెమెరాలను కలిగి ఉన్నాయి. బ్యాక్ కెమెరా విషయానికొస్తే 50MP కాగా.. 12MP అల్ట్రావైడ్ కెమెరాను అమర్చారు. పిక్సెల్ 6 కెమెరాలో 7x డిజిటల్ జూమ్ మాత్రమే ఉంది.
ప్రస్తుతం ఈ పిక్సెల్ 6 గ్రీన్, కోరల్ పింక్, స్టార్మీ బ్లాక్ కలర్స్‌లో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. పిక్సెల్ 7 లెమోన్‌గ్రాస్ గ్రీన్, స్నో వైట్, అబ్సిడియన్ బ్లాక్‌లలో లభిస్తుంది. దీనిని చాలా స్లిమ్‌గా తయారు చేశారు.
రెండూ ఒకే స్క్రీన్ రిజల్యూషన్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్‌లు IP68 డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌ను కలిగి ఉంటాయి. స్క్రాచ్ రెసిస్టెంట్ గ్లాస్ స్క్రీన్‌తో సరి కొత్త ఫీచర్‌తో అందుబాటులో ఉంది.
గూగుల్ పిక్సెల్ 6 పోల్చుకుని పిక్సెల్ 7 చూస్తే చాలా రకాల కొత్త ఫీచర్లతో మార్కెట్‌లోకి వచ్చింది. Pixel 6 యొక్క స్క్రీన్ 6.4 అంగుళాలు కాగా Pixel 7 6.3 అంగుళాలుగా ఉంది. గూగుల్ పిక్సెల్ 6 పోల్చుకొని చూస్తే కొంచెం చిన్నది.
ఈ ఫోన్ వినియోగదారలకు అక్టోబర్ 6నే అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ దీపావళీ ఆఫర్స్‌లలో మీరు ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే మంచి డిస్కౌంట్ లభించనుంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇప్పుడే కొనుగోలు చేయోచ్చు.