Government Job Recruitment 2025: రూ.67 వేల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు.. వారికి ఇది బెస్ట్ ఛాన్స్..
ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం, అర్హత కలిగిన వారు నేరుగా మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సంప్రదించాల్సి ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో తెలిపారు.
అలాగే ఈ ఇంటర్వ్యూ కి వెళ్లే వారు తప్పకుండా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అందించే గూగుల్ ఫారం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగంలో భాగంగా సీనియర్ రెసిడెంట్‌తో పాటు సీనియర్ డెమోన్స్ట్రేటర్ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం ఖాళీల సంఖ్య 73 కాగా.. వీటన్నింటిని త్వరలోనే భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ నోటిఫికేషన్‌లో విద్యార్హతలను కూడా పేర్కొంది. అంతేకాకుండా గరిష్టంగా 45 సంవత్సరాల లోపు వయస్సు గల వారిని మాత్రమే తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతం వివరాల్లోకి వెళితే.. ప్రతి నెల రూ.67,700తో పాటు ప్రత్యేకమైన అలవెన్సులు ఇవ్వబోతున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించారు. అలాగే నాన్ మెడికల్ అభ్యర్థులకు రూ.56 వేలకు పైగా సాలరీని అందించబోతున్నట్లు తెలిపారు.
అలాగే ఈ నోటిఫికేషన్‌లో వయస్సుకు సంబంధించిన సడలింపులను కూడా పేర్కొంది. SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాల పాటు సడలింపు ఉండబోతోంది. అలాగే OBC అభ్యర్థులకు 3 సంవత్సరాల పాటు సడలింపు ఉండబోతున్నట్లు పేర్కొన్నారు. PWD సంబంధించిన వారికి 10 ఏళ్లు ఉండబోతున్నట్లు నోటిఫికేషన్‌లో క్లియర్‌గా వెల్లడించారు.