Union Budget 2025: మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట.. ఎల్పీజీ సిలిండర్ ధరలపై సర్కార్ ఫోకస్

Fri, 10 Jan 2025-9:39 am,

Union Budget 2025: ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్ అంచనాలకు సంబంధించి పలు కీలక విషయాలు వైరల్ అవుతున్నాయి. బడ్జెట్లో ప్రభుత్వం తీసుకోబోయే  నిర్ణయాలపై జనాల్లో పలు ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి.  

ఈ బడ్జెట్ తో సామాన్య ప్రజలకు మేలు కలిగించే విధంగా పలు  నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుంది అన్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే గ్యాస్ సిలిండర్లపై కూడా ఫోకస్ పెడుతున్నట్లు సమాచారం. దేశంలో మూడు ప్రధాన చమురు కంపెనీలకు రూ. 3500 కోట్ల రూపాయలు సబ్సిడీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఓసీ), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌), హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌)లకు ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకంలో వచ్చిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం రూ.35,000 కోట్ల సబ్సిడీని ఇవ్వనుంది.   

 ముడి పదార్థాల ధర పెరిగినప్పటికీ, మూడు ఇంధన రిటైలర్లు దేశీయ LPG ధరను మార్చి 2024 నుండి 14.2 కిలోల సిలిండర్‌కు రూ. 803 వద్ద మార్చకుండా ఉంచారు. ఇది LPG అమ్మకాలపై తక్కువ రికవరీకి దారితీసింది. ఏప్రిల్-సెప్టెంబర్‌లో (ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి సగం) వారి ఆదాయాలు గణనీయంగా తగ్గాయి.   

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎల్‌పిజి అమ్మకాలపై పరిశ్రమ మొత్తం రూ.40,500 కోట్ల నష్టాన్ని చవిచూస్తుందని అంచనా. రెండు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వం మొత్తం రూ.35,000 కోట్లను అందజేస్తుందని ఈ విషయంపై అవగాహన ఉన్న వర్గాలు తెలిపాయి.   

14.2 కిలోల సిలిండర్‌ను ప్రస్తుత ధర రూ. 803 వద్ద దేశీయ గృహాలకు విక్రయించడంలో ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్లు సుమారు రూ. 240 అండర్ రికవరీ (లేదా నష్టం) పొందుతున్నారని సోర్సెస్ తెలిపింది.

IOC, BPCL, HPCL ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2024-25లో రూ. 10,000 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రూ. 25,000 కోట్లు పొందే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించనున్న కేంద్ర బడ్జెట్‌ 2025-26లో సబ్సిడీకి సంబంధించిన కేటాయింపులు జరిగే అవకాశం ఉంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link