Skin Care: ఎంత ఖరీదైన ఉత్పత్తులైనా ఈ బామ్మ చిట్కా ముందు దిగదుడుపే.. మెరిసే గ్లాసీ స్కిన్ ఇంట్లోనే..!
శనగపిండి సౌందర్య ఉత్పత్తిలో ఒక వరం అని చెప్పవచ్చు. దీంతో మెరిసే కాంతివంతమైన చర్మం పొందుతారు.. ముఖంపై ఉన్న మచ్చలు, గీతలు తగ్గిపోతాయి. స్కిన్ కేర్ రొటీన్‌లో చేర్చుకోవడం వల్ల గ్లాసీ స్కీన్ పొందుతారు. డెడ్ స్కిన్ సెల్స్ ని తొలగిస్తుంది, ముఖానికి తక్షణ మెరుపు అందిస్తుంది.
డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతున్న వారికి చర్మం శనగపిండిని పాలలో కలిపి ముఖానికి అప్లై చేయాలి. దీంతో ముఖానికి మాయిశ్చర్ అందిస్తుంది. స్కిన్ కేర్ రొటీన్ లో స్క్రబ్ మాదిరి కూడా ఉపయోగించవచ్చు. మెరిసే కాంతివంతమైన చర్మం తక్షణమే పొందుతారు.
స్కిన్ కేర్ రోటీన్‌లో శనగపిండి ఉపయోగించటం వల్ల ఈ ముఖంపై ఉన్న ట్యాన్ తొలగిస్తుంది. ఎండలో బయటకు వెళ్ళినప్పుడు ముఖంపై ట్యాన్ పేరుకుపోతుంది దీంతో నలుపుదనం వస్తుంది. శనగపిండి వాడటం వల్ల నేచురల్ బ్లీచ్ మాదిరి పనిచేస్తుంది. దీంతో చర్మం పై పేరుకున్న ట్యాన్ కూడా తగ్గిపోతుంది. పాలతో కలిపి ముఖానికి అప్లై చేయాలి. జిడ్డు చర్మం కలవారు రోజ్ వాటర్ తో కలిపి ముఖానికి అప్లై చేసుకోవచ్చు.
ఎన్నో ఏళ్లుగా భారతీయ సంప్రదాయంలో శనగపిండిని ఉపయోగిస్తున్నారు. ఇందులో మ్యాజికల్ లాభాలు ఉన్నాయి. చర్మ సమస్యలను సులభంగా తగ్గిస్తుంది. పాలు లేదా క్రీమ్ పెరుగుతో కలిపి ఈ శనగపిండిను అప్లై చేసుకోవాలి.. ఇవన్నీ వంటగదిలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి మనం ఎక్కువగా ఖర్చు కూడా చేయాల్సిన అవసరం లేదు.
ఎలాంటి కెమికల్స్ లేకుండానే మీ చర్మం మెరిసే మెరిసిపోతుంది. సహజ సిద్ధంగా ముఖంపై ఉన్న గీతాలు తొలగిపోతాయి. శనగపిండిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇది చర్మం మెరుగు పెంచుతుంది. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది.