Jagannath Rath Yatra: ఇసుకేస్తే రాలనంత జనం.. పూరీ జగన్నాథమయం
Jagannath Rath Yatra 2024: ప్రతియేటా జగన్నాథ రథయాత్ర జరుగుతుంది.
Jagannath Rath Yatra 2024: బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుడు రథయాత్రలో పాల్గొన్నాడు.
Jagannath Rath Yatra 2024: ఒడిశాలోని పూరీలో జరిగిన ఈ యాత్రలో లక్షలాది మంది పాల్గొన్నారు.
Jagannath Rath Yatra 2024: ఈ యాత్రలో భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలుముకుంది.
Jagannath Rath Yatra 2024: రథయాత్రకు ఒడిశానే కాకుండా ఆంధ్రప్రదేశ్, చత్తీస్‌గడ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పాల్గొన్నారు.
Jagannath Rath Yatra 2024: రెండు రోజుల పాటు జరిగే ఈ రథయాత్రకు దాదాపు కోటి మంది భక్తులు హాజరవుతారని అంచనా.
Jagannath Rath Yatra 2024: ప్రతి సంవత్సరం రథయాత్ర కోసం ప్రత్యేకంగా రథాలను తయారుచేస్తారు.
Jagannath Rath Yatra 2024: రథయాత్ర సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
Jagannath Rath Yatra 2024: ఈ రథయాత్రలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని జగన్నాథుడి సేవలో మునిగారు.
Jagannath Rath Yatra 2024: రాష్ట్రపతి ముర్ము స్వరాష్ట్రం ఒడిశా. రాష్ట్రపతి అయ్యాక తొలిసారి రథయాత్రలో ఆమె పాల్గొన్నారు.
Jagannath Rath Yatra 2024: సుభద్రమ్మ రథాన్ని రాష్ట్రపతి లాగారు.
Jagannath Rath Yatra 2024: పూరీ జగన్నాథ ఆలయంలో పూరీ రాజవంశీయుల చేతుల మీదుగా పూజల అనంతరం యాత్ర ప్రారంభమైంది.
Jagannath Rath Yatra 2024: యాత్రలో ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంఝీ పాల్గొన్నారు.
Jagannath Rath Yatra 2024: 53 ఏళ్ల తర్వాత రెండు రోజుల పాటు జగన్నాథుడి రథయాత్ర జరగడం విశేషం.