Guarantee Weight Loss Plan: ఈ ప్లాన్ తూచా తప్పకుండా ఫాలో ఆయితే 3 వారాల్లో 7 కిలోలు తగ్గడం గ్యారంటీ
వ్యాయామం
ఈ డైట్ ప్లాన్ తూచా తప్పకుండా పాటిస్తే చాలా సులభంగా 3 వారాల్లో 7 కిలోల బరువు తగ్గవచ్చు. అయితే రోజూ కాస్త వ్యాయామం లేదా వాకింగ్ కూడా చేయాలి
డిన్నర్‌లో ఏం తినాలి
డిన్నర్ సాయంత్రం 6 గంటల వరకూ పూర్తి కావాలి. ఇందులో ఇడ్లీ, జొన్న దోశె, మిక్స్డ్ కూరగాయలు, పన్నీర్ భుర్జీ, రోటీ, శాండ్విచ్ తీసుకోవచ్చు
ఈవెనింగ్ స్నాక్స్ ఏం తినాలి
సాయంత్రం స్నాక్స్ 3 నుంచి 4 గంటల మద్యలో తీసుకోవాలి. స్నాక్స్ రూపంలో ఫ్రైడ్ సోయా చంక్, ఉప్మా, రోస్టెడ్ మఖనా, రోస్టెడ్ శెనగలు, పాప్కార్న్, బేక్డ్ చిప్స్ తినవచ్చు.
లంచ్‌లో ఏం తినాలి
లంచ్ ఎప్పుడూ మద్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట మధ్యలో ఉండాలి. ఇందులో ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, మినరల్స్, విటమిన్లు అధికంగా ఉండేట్టు చూసుకోవాలి. కొద్దిగా అన్నం, పప్పు, ఆకు కూరలు తీసుకోవచ్చు. దాంతో పాటు గ్రీక్ యోగర్ట్, క్వినోవా, బీట్‌రూట్ సలాడ్ తినాలి
బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తినాలి
ఉదయం 10 గంటకు పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. దీంతోపాటు ఏదైనా తేలికపాటి అల్పాహారం తీసుకోవాలి. ఇందులో స్వీట్ లేకుండా చూసుకోవాలి. అది ఫ్రైడ్ రూపంలో ఉండకూడదు. ఇందులో దలియా, ఓట్స్, స్ప్రౌట్స్ ఉంటే మంచిది
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే తిండి
Intermittent Fasting విధానంలో 15-16 గంటలు ఫాస్టింగ్ ఉండాలి. మీరు ఏం తినాలన్నాఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే తినాల్సి ఉంటుంది.
ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్
బరువు తగ్గించేందుకు Intermittent Fasting మంచి పద్ధతి. ఈ పద్థతి పాటించడం ద్వారా చాలా సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. దాంతోపాటు ఆహారపు అలవాట్లపై కూడా ప్రత్యేక శ్రద్ద పెట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో ప్రత్యేక డైట్ తీసుకోవాలి.