World Richest Village: ప్రపంచంలోనే ధనిక గ్రామం, అక్కడందరూ కోటీశ్వరులే, కారణమేంటి

Tue, 23 Jul 2024-6:05 pm,

మాధాపూర్ విలేజ్ అసోసియేషన్

లండన్ దేశంలో పనిచేసే ఇక్కడి ప్రజలు 1968లో మాధాపూర్ విలేజ్ అసోసియేషన్ స్థాపించారు. ఈ అసోసియేషన్ ఉద్దేశ్యం విదేశాల్లో  ఊరి పేరు నిలబెట్టడం. 

షాపింగ్ మాల్స్, 5 స్టార్ హోటల్ సేవలు

ఈ గ్రామం ఎంత సంపన్నమైందంటే ఇక్కడ ఇళ్లన్నీ విలాసవంతంగా ఉంటాయి. ఊర్లో అద్భుతమైన రోడ్లుంటాయి. ఆరోగ్య వ్యవస్థ బాగుంటుంది. ఎడ్యుకేషన్ సంస్థలు బాగుంటాయి. ఈ ఊర్లో షాపింగ్ మాల్, 5 స్టార్ హోటల్ కూడా ఉంది

గ్రామంలో దాదాపు అందరూ లక్షాధికారులే

ఇక్కడ దాదాపు 7600 ఇళ్లున్నాయి. అత్యధికులు ఎన్ఆర్ఐలే. ఈ గ్రామంలో 17 బ్యాంకులున్నాయంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కోటీశ్వరులు లేదా లక్షాధికారులే కన్పిస్తారిక్కడ.

మాధాపార్ ధనిక గ్రామంగా ఎలా మారింది

మాధాపార్ గ్రామం ఆర్ధికంగా పటిష్టంగా ఉండటానికి కారణం ఇక్కడి ప్రజల కష్టం, విదేశాల్లో సక్సెస్ అవడం. ఈ గ్రామంలో అత్యధికులు విదేశాల్లో ఉంటారు. ప్రత్యేకించి యూకే, యూఎస్ఏ, కెనడా వంటి దేశాల్లో ఉండి సంపాదిస్తుంటారు.  విదేశాల్లో సంపాదిస్తూ గ్రామాలకు డబ్బులు పంపిస్తుంటారు

ప్రపంచంలోనే ధనిక గ్రామం

ఈ గ్రామం ప్రపంచంలోనే అత్యంత ధనిక గ్రామం. అలాగని ఈ గ్రామం ఏ స్విట్డర్లాండ్ లేదా దుబాయ్ దేశంలో లేదు. ఇండియాలోనే ఉంది. గుజరాత్ కచ్ జిల్లాలోని మాధాపార్ గ్రామమిది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link