Guru Purnima 2024: గురు పౌర్ణమి ఎప్పుడు..?.. ఈ పండగ విశిష్టత.. ఆషాడం లోనే ఎందుకు చేసుకుంటామంటే..?

Thu, 18 Jul 2024-3:02 pm,

ఆషాడమాసాన్ని కొందరు శూన్యమాసం అంటారు. కానీఈ నెలలో కూడా అనేక ముఖ్యమైన పండుగలు  ఉంటాయి. ఈ నెలలో.. పూరీ జగన్నాథ్ రథయాత్ర, బోనాలు,  తొలి ఏకాదశి. గురు పౌర్ణమి పండుగలు వస్తాయి.అదేవిధంగా.. ఈ మాసంలో మంగళవారం రోజు కొత్తగా పెళ్లైన వారు. మంగళగౌరీ వ్రతాలు కూడా జరుపుకుంటారు. 

ప్రతి  ఏడాది ఆషాడంలో గురు పౌర్ణమిని జరుపుకుంటారు. మన సంస్కృతి, సంప్రదాయాల్లో గురువులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పురాణ పురుషులు సైతం.. మానవులుగా జన్మించి భూమి మీద పుట్టినప్పుడు వీరు గురువుల దగ్గర విద్యను అభ్యసించారు. ఈ నేపథ్యంలో..శ్రీరాముడికి గురువుగా  విశ్వమిత్రుడు, శ్రీకృష్ణుడికి సాందీపుడు, పాండవులకు గురువుగా ద్రోణుడు.. ఇలా పురాణాలు చూసుకుంటే గురువు యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థం అవుతుంది. 

అదే విధంగా వేద భగవానుడు వ్యాసుడుకూడా ఆషాడంలో జన్మించాడని చెబుతుంటారు. వ్యాసభగవానుడే వేదాలను రచించాడు. అందుకు వ్యాస పౌర్ణమిని గురుపౌర్ణమిగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో.. ఈసారి గురు పౌర్ణమిని జులై 21న జరుపుకుంటున్నారు. పంచాంగం ప్రకారం.. ఆషాఢ మాసంలోని పౌర్ణమి తిధి జూలై 20వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తేదీ జూలై 21 సాయంత్రం 3:47 గంటలకు ముగుస్తుంది. అంటే.. జులై 21 వ తేదీన సూర్యోదయం తిథిలో పౌర్ణమి ఉన్న నేపథ్యంలో ఆదివారం ఈ పండుగ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.

జూలై 21వ తేదీ న గురు పౌర్ణమి  నాడు కొన్ని నియమాలు పాటిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకొవచ్చని పండితులు చెబుతున్నారు. అదే విధంగా.. గురుపౌర్ణమి రోజున.. ఈ పనిచేసిన కూడా అది వెయ్యిరెట్లు లాభాలు ఇస్తుందని పండితులు చెబుతున్నారు. తెల్లవారు జామున నిద్రలేవాలి. తలస్నానంచేసి, ఇంట్లో పూజగదిని శుభ్రం చేసుకొవాలి. ఈరోజు గురువులను, దత్తాత్రేయుడు, సాయిబాబాలను చాలా మంది తమ గురువులుగా భావిస్తారు. శ్రీ పాద వల్లభులు, అక్కల్ కోట్ స్వామి, స్వామిసమర్థ దేవుళ్లను చాలా  మంది గురువులుగా భావిస్తారు. చాలా మంది గౌతమ బుధ్దుడ్ని కూడా తమ గురువుగా భావిస్తారు.

గురు పౌర్ణమి రోజున.. శివుడిని, విష్ణువు, వేదవ్యాస భగవానుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించాలి. అదే విధంగా.. ప్రత్యేకంగా అలంకరణలు చేయాలి. అదే విధంగా గురుపౌర్ణమి నేపథ్యంలో గురుచరిత్ర పారాయణం చేయాలని పండితులు చెబుతున్నారు. సాయి చరిత్రలను చదివితే జీవితంలో ఉన్నకష్టాలన్ని దూరమౌతాయని పండితులు చెబుతుంటారు.

ప్రస్తుతం చాలా మంది గురుపౌర్ణమి రోజున తమకు చదువు చెప్పిన గురువులను ప్రత్యేకంగా సన్మానించుకుంటారు. పాఠశాలలో కూడా గురుపూజోత్సవం ను నిర్వహిస్తున్నారు. తమ టీచర్లను శాలువాలు, పూల దండలు, స్వీట్లు వగైరాలు ఇచ్చి తమ గురు భక్తిని చాటుకుంటున్నారు. మనం అనాదీగా కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు పాటించడం వల్ల ప్రస్తుత తరాలతోపాటు,తర్వాతి తరాలు కూడా  గురువు పట్ల గౌరవ మర్యాదలతో ఉంటారు. సమాజంలో గురువుపట్ల రెస్పెక్ట్ ఇవ్వడం పెంపొందుతుంది. 

గురు పౌర్ణమి రోజు చేసే పూజలు, దాన ధర్మాలు, వ్రతాలు కూడా వెయ్యిరెట్లు అధికమైన ఫలితాలను ఇస్తాయని చెబుతుంటారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా గురువు పట్ల గౌరవ, మర్యాదలతో ఉంటారు. గురువు అనుగ్రహం ఉంటే.. మనిషి జీవితంలో ఉన్నతమైన స్థానానికి ఎదుగుతాడని చెబుతుంటారు. అందుకే గురుపౌర్ణమి రోజున ఈ నియమాలు పాటించాలని పండితులు చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link