DLF Dahlias: ఇది అపార్ట్ మెంట్ కాదు.. ఇంద్ర భవనం.. ఒక్కో ఫ్లాటు ధర అక్షరాలా రూ. 100 కోట్లు.. ఎక్కడంటే..?
DLF The Dahlias Project:హైదరాబాదులో అపార్ట్మెంట్ ధరలు చుక్కలను తాగుతున్నాయని సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. జంట నగరాల్లో అపార్ట్మెంట్ ధరలు ఒక్కో ఫ్లాట్ కనీసం రూ. 50 లక్షల నుంచి మొదలైతే రెండు నుంచి మూడు కోట్ల వరకు ఉంటున్నాయి. ఇక లగ్జరీ అపార్ట్మెంట్స్ అయితే దాదాపు ఒక్కో ఫ్లాట్ రూ. 5 కోట్ల వరకు ఉంటుంది. ఇక ఐదు కోట్ల రూపాయల ఫ్లాట్ అనగానే అందరూ నోరేళ్ల పెట్టడం ఖాయం. అయితే తాజాగా భారత దేశంలో అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. అదే డిఎల్ఎఫ్ వారి ది డహ్లియాస్ ప్రాజెక్ట్.. ఇక్కడ ఒక్కో అపార్ట్మెంట్ ధర ఎంతో తెలిస్తే చుక్కలు కనిపించడం ఖాయం.
ఐదు కాదు పది కాదు ఏకంగా ఒక్కో అపార్ట్మెంట్ ద్వారా వంద కోట్లు అంటే అవును మీరు విన్నది నిజమే అక్షరాల 100 కోట్లు పెట్టి ఇక్కడ అపార్ట్మెంట్ కొనేందుకు జనం సిద్ధమవుతున్నారు. మరి ఈ ప్రాజెక్టు ఎక్కడ ఉంది ఇందులో స్పెషాలిటీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దేశంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ DLF కంపెనీ గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్‌లో దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ DLF ది డహ్లియాస్‌ను తీసుకువస్తోంది. దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్‌గా దీన్ని పేర్కొంటున్నారు.
దేశంలోని అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ DLF ది డహ్లియాస్ ప్రాజెక్ట్‌తో ముందుకు వచ్చింది. 17 ఎకరాల్లో ది డహ్లియాస్‌ను నిర్మించను న్నారు. ఇది 29 అంతస్తుల టవర్, ఇందులో సుమారు 400 లగ్జరీ అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. ఇందులో ఒక్కో ఫ్లాట్ 9,500 నుండి 16,000 చదరపు అడుగుల వరకు ఉంటాయి. సగటున వాటి పరిమాణం 11,000 చదరపు అడుగుల వరకు ఉంటుంది.
DLF డహ్లియాస్ అపార్ట్‌మెంట్ లో ఫ్లాట్ కొనుగోలు చేసిన నివాసితులకు చాలా సౌకర్యాలను అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో జిమ్, స్విమ్మింగ్ పూల్, స్పా, వెల్‌నెస్ సెంటర్‌తో కూడిన అత్యాధునిక క్లబ్ హౌస్ కూడా ఉంది. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్‌ల కోసం కూడా ఇక్కడ ప్రత్యేకంగా సృష్టించారు.టెన్నిస్ కోర్ట్, ఫిట్‌నెస్ కోసం జాగింగ్ ట్రాక్ కూడా ఉన్నాయి.
ది డహ్లియాస్‌లో ఫ్లాట్ ప్రారంభ ధర రూ.100 కోట్ల వరకు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ విక్రయానికి సంబంధించి మొత్తం రూ. 34,000 కోట్ల వరకు డీల్స్ జరిగాయి. దేశంలో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన హౌసింగ్ ప్రాజెక్ట్ గా ముంబైలోని వర్లీలో ఉన్న ఒబెరాయ్ రియల్టీ 360 వెస్ట్ గురించి ఇంతకాలం అందరూ చెప్పుకున్నారు.