Hair Care Tips: మీ జుట్టు అదే పనిగా రాలిపోతుందా, కిచెన్‌లో ఉండే ఈ వస్తువులతో హెయిర్ ఫాల్ కు చెక్
మెంతులు ఓ గిన్నె నీటిలో తీసుకుని రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు దానిని పేస్ట్‌గా చేసి తలకు రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్‌కు రాయాలి. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.
తలకు ఉల్లిపాయ రసం రాయడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీనివల్ల కేశాలు పటిష్టంగా మారడమే కాకుండా వేగంగా ఎదుగుతాయి. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అల్లోవెరా జెల్ కూడా మంచి ఫలితాలనిస్తుంది.
గుడ్లలోని తెల్లని భాగం కేశాలకు రాయడం వల్ల మంచి ఫలితాలు గమనించవచ్చు. గుడ్లలో ఉండే బయోటిన్, విటమిన్ బి కాంప్లెక్స్ కేశాల ఎదుగుదలకు దోహదం చేస్తాయి.
కేశాలకు ప్రతిరోజూ రాత్రి వేళ కొబ్బరి నూనె రాసి బాగా మస్సాజ్ చేసుకోవాలి. దీనివల్ల కేశాలు మృదువుగా మారతాయి. వేగంగా ఎదుగుతాయి. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి.