Hair Fall: జుట్టు ఊడిపోతుందని బాధపడుతున్నారా? ఒక్కసారి దీన్ని తలకి రాస్తే.. జీవితంలో జుట్టు ఊడదు..!
జుట్టు విపరీతంగా రాలిపోతున్నవారు ముఖ్యంగా ఏ ఆరోగ్య సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఆ తర్వాత జుట్టుకు సరైన కేర్ తీసుకోవాలి. అంటే జుట్టుకు నూనె పెట్టడం, ఎండలో వెళ్లినప్పుడు, బయటకు వెళ్లినప్పుడు కాలుష్యం బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇంట్లో ఉండే కొన్ని చిట్కాలతో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టొచ్చు. మీ డైట్‌లో సరైన విటమిన్స్, పోషకాలు కూడా చేర్చుకోవాలి. ఇవి కాకుండా వారానికి కనీసం ఒక్కసారి అయిన ఆకుకూరలు తినాలి. ఇందులో విటమిన్ ఏ కూడా పుష్కలంగా ఉంటుంది.
అయితే, ఇంట్లో ఉండే కరివేపాకు, పెరుగుతో సింపుల్‌గా ఈ ప్యాక్ వేసుకోవచ్చు. ఈ పేస్ట్ మీ జుట్టుపై అద్భుతమై చూపిస్తుంది. ఎందుకంటే ఇందులో గుంటగలగరాకు కూడా కలపాలి. దీన్ని వాడిన మొదటిసారే మీరు మంచి ఫలితాలను పొందుతారు.
ఈ గ్రీన్ పేస్ట్ తయారీకి ముందుగా కరివేపాకు తీసుకోవాలి. వీటిని చిన్న మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇందులోనే గుంటగలగరాకు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ మాదిరి తయారు చేయాలి. ఆ తర్వాత పుల్లని పెరుగు కూడా వేసి మరోసారి మిక్సీ పట్టాలి.
ఇందులో మీరు కావాలంటే విటమిన్ ఇ క్యాప్సూల్ కూడా వేసుకోవచ్చు. ఈ పేస్ట్ జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేయాలి. బాగా ఆరిన తర్వాత హెయిర్ వాష్ చేయాలి.
ఈ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల జుట్టులో డ్యాండ్రఫ్ సమస్య తగ్గిపోతుంది. హెయిర్ ఫోలికల్స్ బలపడతాయి. అంతేకాదు మీ జుట్టు త్వరగా నల్లబడదు. వారానికి ఓ రెండుసార్లు జుట్టుకు అప్లై చేయడం వల్ల అద్భుతాలు చూస్తారు.
మీరు మొదటి సారి వాడినట్లయితే ముందుగా మీ స్కిన్‌పై టెస్ట్ చేసుకోండి. ఆ తర్వాతే ఈ పేస్ట్‌ను వాడండి. అయితే, ఇందులో నేచురల్‌గా కరివేపాకు, గుంటగలగరాకు, పుల్లని పెరుగు ఉపయోగిస్తున్నం ఇవన్నీ మార్కెట్‌లో దొరికే హెయిర్ కేర్ ఉత్పత్తుల్లో ఉంటాయి. కానీ, ఇవి జుట్టుకు నేచురల్ పెరుగుదలను అందిస్తాయి.