Beauty Tips : రూపాయి ఖర్చు లేకుండా..హల్దీ ఫంక్షన్లో తమన్నాలా మెరిసిపోవాలా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
Haldi Function Makeup: శ్రావణమాసం వచ్చేసింది. పెళ్లిళ్ల సీజన్ షురూ అయ్యింది. ఈ నెలంతా పెళ్లిళ్ల సందడి ఉంటుంది. ఎక్కడ చూసిన బ్యాండ్ బాజా మోగుతూనే ఉంటుంది. మ్యారేజ్ అనగా సంగీత్, హల్దీ హైలేట్. మీరు హల్దీ ఫంక్షన్ లో అందంగా తమన్నాలా మెరిసిపోవాలంటే ఈ సింపుల్ మేకప్ టిప్స్ అందిస్తున్నాం. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్ వెళ్లాల్సిన అవసరం లేదు. లైట్ మేకప్ వేసుకుంటే చాలు. ఈ లైట్ మేకప్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం.
హల్దీ అనగానే చాలా మంది ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటారు. కొంతమంది వైట్ కలర్ కూడా వేస్తుంటారు. ముఖానికి పసుపు రాయడంతో ఫంక్షన్ షురూ అవుతుంది. ఈ ఫంక్షన్ లో పసుపుదే కీలకం. కాబట్టి మీరు వేసుకునే మేకప్ ను హల్దీ డ్యామినేట్ చేసేలా ఉండకూడదు. ముఖ్యంగా పెదవులు, కళ్లు ఈ రెండు హైలెట్ అవుతాయి. హల్దీ కోసం మేకప్ కు సంబంధించిన కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం.
హల్దీ ఫంక్షన్ కు ముందు మీ ముఖాన్ని శుభ్రవంగా కడుక్కోవాలి. నీటితో కాకుండా ఫేస్ వాష్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు మాయిశ్చరైజర్ ను వాడాలి. మేకప్ ఎక్కువ సేపు ఉండాలంటే ప్రైమర్ ను అప్లై చేసుకోవాలి. ఫౌండేషన్ లైట్ గా వేసుకోవాలి. స్కిన్ టోన్ కు సరిపోయే ఫౌండేషన్ మాత్రమే అప్లయ్ చేసుకోవాలి. అది ఎక్కువగా ఉండకూడదు. దీంతో లుక్ నేచురల్ గా సింపుల్ గా కనిపిస్తుంది. హల్దీ సమయంలో మేకప్ సెట్ చేయడానికి సెట్టింగ్ స్ప్రేను ఉపయోగించాలి. తరచుగా టప్ అప్స్ అవసరం లేకుండా చేస్తుంది. అంతేకాదు చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.
ఇక కళ్లకు నేచురల్ లుక్ కనిపించేందుకు పాస్టెల్ లేదా న్యూట్రల్ ఐషాడో వంటి లైట్ షేడ్స్ ను అప్లై చేసుకోవాలి. మీరు కాజల్, మాస్కరా కూడా వాడుకోవచ్చు. ఇక స్మోకీ లేదా డార్క్ ఐ మేకప్ వేయకూడదు. బుగ్గలపై లైట్ బ్లష్ వేసుకుంటే బెస్ట్. ఇలా మేకప్ వేసుకుంటే నేచురల్ లుక్, ముఖంగా బొద్దుగా అందంగా కనిపిస్తుంది. వీటికి కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న మేకప్ ప్రొడక్టులను మాత్రమే వాడుకోవచ్చు.
లిప్ స్టిక్ షేడ్ లైట్ గా ఉండాలి. మరీ డార్క్ గా ఉంటే హల్దీ డామినేట్ చేస్తుంది. లిప్ గ్లాస్ అయితే ఇంకా బాగుంటుంది. పింక్ లేదా పీచ్ లేదా న్యూట్రల్ షేడ్స్ అయితే బెటర్. లిప్ లైనర్ వేసుకుంటే కూడా బాగుంటుంది. ఈ మేకప్ ట్రిక్స్ ఫాలో అయితే హల్దీ రోజు మీరు డిఫరెంట్ గా కనిపించడమే కాకుండా మీ ఫొటోల్లో కూడా నేచురల్ బ్యూటీలా కనిపిస్తారు.