Hamsa Nandini Photos: వైజాగ్ హార్బర్లో హంసానందిని సందడి.. పొట్టి గౌనులో అందాల ఆరబోత
పూణేలో పుట్టి పెరిగిన పూనం భర్తకే సినిమాల మీద చిన్నప్పటి నుంచి చాలా ఆశలు పెంచుకుంది. అలా మోడల్ అయ్యేందుకు ముంబైకి షిఫ్ట్ అయిన ఆమె ముంబైలో మోడలింగ్ చేస్తూ ఉండేది.
కానీ తెలుగులో ఒకటవుదాం అనే సినిమాలో హీరోయిన్గా అవకాశం రావడంతో హీరోయిన్గా మారిన ఆమె తర్వాత వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. 786 ఖైదీ ప్రేమ కథ, మోహిని వంటి సినిమాల్లో నటించింది.
వీటిలో ఏ సినిమా ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు. కానీ అనుమానాస్పదం అనే సినిమా కోసం హంసానందినిగా మారి ఒక్కసారిగా టాలీవుడ్ లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది.
అలా గీత, అధినేత, ప్రవరాఖ్యుడు, అహ నా పెళ్ళంట, నా ఇష్టం, ఈగ, మిర్చి, రామయ్య వస్తావయ్య, అత్తారింటికి దారేది, లెజెండ్, లౌక్యం, రుద్రమదేవి, బెంగాల్ టైగర్, సోగ్గాడే చిన్నినాయన, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, జై లవకుశ వంటి సినిమాల్లో వరుస సినిమా అవకాశాలు దక్కించుకొని దూసుకుపోతోంది.
ఈ మధ్యకాలంలోనే ఆమె క్యాన్సర్ బారిన పడి కోలుకుంది. ఇప్పుడు తాజాగా విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ కి వెళ్లి ఫోటోలకు ఫోజులు ఇచ్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది మీరు చూసేయండి.