Hansika: హన్సిక అష్ట కష్టాలు.. ఇవి ఎప్పటికీ తీరేను!
అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు.. పరిచయమైన హీరోయిన్ హన్సిక. చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని అడ్వటైజ్మెంట్స్ లో అలానే సినిమాల్లో కనిపించిన హన్సిక.. తమిళ, తెలుగులో హీరోయిన్గా కూడా ఎన్నో సినిమాలు చేసింది.
ముఖ్యంగా తమిళంలో ఎన్నో రోజుల పాటు స్టార్ హీరోయిన్గా కొనసాగింది ఈ నటి. తెలుగులో దేశముదురు తరువాత కంత్రి, బిల్లా లాంటి సినిమాలలో కనిపించి మెప్పించింది. అయితే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాలు మాత్రం అనుకోలేక పోయింది ఈ ముద్దుగుమ్మ.
మరోపక్క ఈ మధ్య వరకు తమిళంలో మాత్రం మంచి విజయాలు.. అందుకుంటూ వచ్చింది. కానీ పెళ్లి తర్వాత హన్సిక పరిస్థితి మాత్రం అయోమయంలో పడిపోయింది. హన్సిక సినిమాలతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది. అయితే ఇవేవీ కూడా ఆమెకు విజయాలు అందించలేదు.
మరీ ముఖ్యంగా హన్సిక.. ఎక్కువగా తన ప్రాధాన్యత ఉన్న చిత్రాలు ఒప్పుకుంటూ వచ్చింది. 105 మినిట్స్.. మై నేమ్ ఇస్ శ్రుతి.. లాంటి చిత్రాలు ఒప్పుకోవడంతో.. కమర్షియల్ హీరోయిన్ గా హన్సిక కి ఛాన్సులు తగ్గిపోతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈమె కెరియర్ అయోమయంలో పడినట్లు వినికిడి.
మరి ఇవన్నీ దాటుకొని మళ్ళీ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్గా ఆఫర్లు సంపాదిస్తుందేమో చూడాలి. మరోపక్క హన్సిక.. తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా మాత్రం అభిమానులను తెగ అలరిస్తూ ఉంటుంది.