Hansika: సాంప్రదాయ చీరకట్టులో ఏంజెల్ లా మెరిసిపోతున్నహన్సిక.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Fri, 21 Jun 2024-3:11 pm,

హన్సిక.. తెలుగు ప్రేక్షకులు ఈమెను బొద్దు గుమ్మగా గుర్తు పెట్టుకున్నారు. అంతేకాదు ఆ అందాలతోనే తమిళ తంబీల ఆరాధ్య కథానాయికగా మారింది. ఏకంగా గుడి కట్టించే రేంజ్ ఎదిగింది.

తెలుగులో అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో సరసన నటించిన హన్సిక.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ‘కంత్రి’ మూవీలో నటించింది. అటు పెద్ద హీరోలెవరు ఈమెకు ఛాన్సులు ఇవ్వలేదు. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం ఈమెను నెత్తిన పెట్టుకుంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అప్పట్లో హన్సిక తన పెళ్లి కోసం ఏకంగా రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు కోడై కూసాయి. 2007లో హీరోయిన్ గా పరిచయమైన కథానాయికగా గత 17 యేళ్లుగా అలరిస్తూనే ఉంది

హన్సిక చేతిలో సినిమాలున్నా.. లేకపోయినా.. ఎప్పుడు తన హాట్ ఫోటో షూట్ లతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ హల్ చల్ చేయడం హన్సిక మార్క్ స్టైల్ అని చెప్పాలి.

హన్సిక తెలుగులో ‘తెనాలి రామకృష్ణ BA. BL’ సినిమాతో పలకరించింది. ఆ తర్వాత మై నేమ్ ఈజ్ శృతి, 105 మినిట్స్ సినిమాలతో పలకరించింది. మొత్తంగా తెలుగు ఆడియన్స్ హన్సికను పూర్తిగా మరిచిపోయినట్టు తెలుస్తోంది.

తాజాగా అచ్చ తెలుగు ఆడపడుచులా తెల్ల రంగు చీరలో నగలతో హన్సిక చేసిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.ఈమె 1991 ఆగష్టు 9న ముంబైలో జన్మించింది.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link