Hansika: హన్సికలో సడెన్ గా వచ్చిన ఈ మార్పును గమనించారా.. !

Tue, 17 Sep 2024-11:51 am,

హన్సిక.. తెలుగు ఆడియన్స్  ఈమెను బొద్దు గుమ్మగా గుర్తు పెట్టుకున్నారు. అంతేకాదు ఆ అందాలతోనే తమిళ తంబీల ఆరాధ్య కథానాయికగా మారింది. ఏకంగా వాళ్ల చేత  గుడి కట్టించే రేంజ్ ఎదిగింది.

తెలుగులో అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో సరసన నటించిన హన్సిక.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ‘కంత్రి’ మూవీతో పలకరించింది. తారక్, అల్లు అర్జున్ తర్వాత మరె పెద్ద హీరోలెవరు ఈమెకు ఛాన్సులు ఇవ్వలేదు. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం హన్సికను  నెత్తిన పెట్టుకుంది.

 

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అప్పట్లో హన్సిక తన పెళ్లి కోసం ఏకంగా రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు కోడై కూసాయి. 2007లో హీరోయిన్ గా పరిచయమై ఇప్పటికీ కథానాయికగా అలరిస్తూనే ఉన్నాయి. 

హన్సిక చేతిలో సినిమాలున్నా.. లేకపోయినా.. ఎప్పుడు తన హాట్ ఫోటో షూట్ లతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ హల్ చల్ చేయడం హన్సిక మార్క్ స్టైల్ అని చెప్పాలి. తాజాగా సన్నబడి నాజుగ్గా తయారైంది. దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

హన్సిక 1991 ఆగష్టు 9న ముంబైలో జన్మించింది. ముందుగా బాలనటిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత టాప్ హీరోయిన్ గా సత్తా చూపెడుతుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link