Hansika: పండగ కళ మొత్తం హన్సిక లోనే కనిపిస్తోందిగా.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
హన్సిక పెళ్లి తర్వాత ఆచితూచి సినిమాలు చేస్తోంది. అంతేకాదు ఎప్పుడు తన హాట్ ఫోటో షూట్ లతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ హల్ చల్ చేయడం హన్సిక మార్క్ స్టైల్ అని చెప్పాలి. మ్యారేజ్ మల్లె తీగలా సన్నబడి నాజుగ్గా తయారైంది. తాజాగా దీపావళి సందర్బంగా చీరటకట్టు, నగలతో కనిపించి అభిమానులను ఫిదా చేస్తోంది.
9 ఆగష్టు 1991 ముంబైలో హన్సిక జన్మించింది. ముందుగా బాలనటిగా పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత టాప్ కథానాయికగా సత్తా చూపెడుతుంది.
హన్సిక.. తెలుగు ప్రేక్షకులు బొద్దు గుమ్మగా గుర్తు పెట్టుకున్నారు. అంతేకాదు ఆ గ్లామర్ తోనే తమిళ తంబీల ఆరాధ్య హీరోయిన్ గా గుడి కట్టించుకునే స్థాయికి చేరింది.
తెలుగులో అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోకు జోడిగా నటించిన హన్సిక.. ఆ తర్వాత ఎన్టీఆర్ తో ‘కంత్రి’ చిత్రం చేసింది. ఎన్టీఆర్, బన్ని తర్వాత తెలుగులో బడా స్టార్ హీరోలెవరు ఈమెకు ఛాన్సులు ఇవ్వలేదు. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం హన్సికను నెత్తిన పెట్టుకుంది.
అప్పట్లో హన్సిక తన పెళ్లి కోసం ఏకంగా రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు కోడై కూసాయి. ప్రస్తుతం హన్సిన ఆచితూచి ఆచితూచి సినిమాలు చేస్తోంది. 2007లో కథానాయికగా ఇంట్రడ్యూస్ అయిన ఇప్పటికీ హీరోయిన్ గా లైమలైట్ లో ఉండటం మాములు విషయం కాదు.